Hyderabad: Video Of Facilities In Amazon Centre, Video Goes Viral - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అమెజాన్‌ సొంత క్యాంపస్‌.. అదిరిపోయే సౌకర్యాలు

Published Mon, Jan 17 2022 11:42 AM | Last Updated on Mon, Jan 17 2022 12:21 PM

Video Of Facilities In Amazon Centre In Hyderabad - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్‌లో పెడుతోంది. అమెరికా వెలుపల ఆ సంస్థ తొలి క్యాంపస్‌ని హైదరాబాద్‌లోనే నిర్మిస్తోంది. 2015లో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. 

అమెజాన్‌ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మిస్తున్న క్యాంపస్‌లో ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించింది. 18 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన ఈ భవనంలో 15 వేల మంది ఉద్యోగులు పని చేసే వీలుంది. ఇక్కడున్న క్యాంటీన్‌లో ఒకేసారి 2700ల మంది భోజనం చేయవచ్చు. ఈ భవనంలో 49 హైస్పీడ్‌ లిఫ్టులు ఉన్నాయి. థీమ్‌ బేస్డ్‌గా ప్రతీ ఫ్లోర్‌ని అందంగా తీర్చిదిద్దారు. ఈ భవనంలో ఉన్న సౌకర్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మీరు ఓసారి అమెజాన్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ని చూడండి.

చదవండి: బ్రాండ్‌ హైదరాబాద్‌.. లండన్‌, న్యూయార్క్‌.. ఇప్పుడు మనదగ్గర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement