![Amazon Decided to Low Plastic in Packaging - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/5/amazo.jpg.webp?itok=fbrtJIML)
న్యూఢిల్లీ: ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి పనికొచ్చే ప్లాస్టిక్‌తో ప్యాకేజింగ్‌ను 2020 జూన్ నాటికి పూర్తిగా నిలిపివేయాలని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిర్దేశించుకుంది. ప్రస్తుతం తమ గిడ్డంగుల్లో ప్యాకేజింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌లో సింగిల్ యూజ్ తరహా ప్లాస్టిక్ వాటా ఏడు శాతం కన్నా తక్కువే ఉంటుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. వ్యర్ధాలను తగ్గించుకుని, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించాలన్న లక్ష్యానికి అమెజాన్ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. బబుల్ ర్యాప్స్, ఎయి ర్ పిల్లో మొదలైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్ప త్తుల స్థానంలో ’పేపర్ కుషన్స్’ను వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరుకి అన్ని గిడ్డంగులకు విస్తరించనున్నట్లు సక్సేనా వివరించారు. 2021 మార్చికి 100% రీసైకిల్డ్ ప్లాస్టిక్ వినియోగం దిశగా.. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని 25% తగ్గించుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment