Amazon Prime Day, Amazon Announces Discount Sale To Start On July 26 - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!

Published Thu, Jul 8 2021 6:39 PM | Last Updated on Fri, Jul 9 2021 8:51 AM

Amazon Prime Day Sale Announced For 2021 Big Discounts - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన కస్టమర్లకు తీపికబురును అందించింది. అమెజాన్‌ తన కస్టమర్లకు ‘ప్రైమ్‌ డే సేల్‌’ను ప్రకటించింది. ప్రైమ్‌ డే సేల్‌ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్‌ జరగనుంది. మొదట ఈ సేల్‌ను జూన్‌ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్‌ కారణంగా ప్రైమ్‌ డే సేల్‌ వాయిదా పడింది. కోవిడ్‌-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్‌ డే సేల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 


భారత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రైమ్‌ డే సేల్‌లో బ్లాక్‌బస్లర్‌ డీల్స్‌తో పాటు, భారీ డిస్కౌంట్లను, సూపర్‌ సేవింగ్‌ డీల్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుంగా సుమారు 300కి పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. కాగా జూలై 8 నుంచి జూలై 24 వరకు అమ్మకందారులతో అమెజాన్‌ ఒప్పందాలను కుదుర్చుకోనుంది. 

స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, వంటివి లాంచ్‌ చేయడమే కాకుండా వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ లక్షలాది స్థానిక వ్యాపారులకు లాక్‌డౌన్‌ నుంచి ఉపశమనం కల్గుతుందని అమెజాన్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement