Prime Day Deals
-
ఈ స్మార్ట్ ఫోన్లనే ఎగబడి కొంటున్నారంట
అమెజాన్ ప్రైమ్‌డేలో మరోసారి మొబైల్ఫోన్లు దుమ్ముదులిపాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా వివిధ కేటరిగిల్లో వేల సంఖ్యలో వస్తువులను అమ్మకానికి పెట్టగా.. జనాలు స్మార్ట్ఫోన్లు కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్ఫోన్ల వాటానే ఎక్కువగా ఉంది. ఫోన్లప్రై ప్రకటించిన డిస్కౌంట్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ఫోన్లలను ప్రైమ్‌డేలో సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 1.26 లక్షల కొనుగోళ్లు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 48 గంటల పాటు 'ప్రైమ్ డే' సేల్ నిర్వహించింది. ఈ స్మాల్ మీడియం బిజినెస్ మోడల్లో డెస్క్‌ట్యాప్, ల్యాప్ ట్యాప్, బ్యూటీ ప్రాడక్ట్, దుస్తులు, ఇంట్లో ఉపయోగించే సామాగ్రి, స్మార్ట్ ఫోన్లతో పాటు వంటగదిలో వినియోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్ తెలిపింది. రెండురోజుల పాటు జరిగిన ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ 1.26లక్షల మంది కొనుగోళ్లు చేయగా..31,000 మంది అమ్మకాలు జరిపినట్లు.. ఆ అమ్మకాల్లో 25శాతం మంది పైగా రూ.1కోటి పైగా బిజినెస్ నిర్వహించినట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. 10 నగరాల్లో ప్రధానంగా ప్రధానంగా 10నగరాల్లో 70శాతం మంది కొత్త ప్రైమ్ మెంబర్స్ షాపింగ్ చేసినట్లు అమెజాన్ చెప్పింది. అందులో ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్ కు చెందిన అనంతనాగ్,జార్ఖండ్ లోని బొకారో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, నాగలాండ్ లోని మొకోక్చుంగ్, పంజాబ్‌లోని హోషియార్పూర్, తమిళనాడులో నీలగిరి, కర్ణాటకలోని గడగ్, కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. ఎక్కువ ఏ బ్రాండ్ ఫోన్లను కొనుగోలు చేశారంటే అమెజాన్ ప్రైమ్ డేలో వన్ ప్లస్ నార్డ్2 5జీ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, రెడ్ మీ నోట్ 10 సిరీస్, రెడ్మీ 9, శాంసంగ్ గెలాక్సీ ఎం 31ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్మీ సీ11 ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అమెజాన్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
Amazon Prime Day Sale: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు ఆపిల్ ఐఫోన్ 11పై సుమారు రూ. 6900 తగ్గింపు ధరతో రూ. 47, 999 అందించనుంది. అసలు ధర. రూ 54,900 వన్‌ప్లస్ 9పై తొలిసారిగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. కూపన్ల రూపంలో సుమారు రూ. 4000 వరకు తగ్గింపును అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 22, 999 కు లభించనుంది. 6 నెలల నోకాస్ట్ ఈఎమ్ఐ రూపంలో కూడా కోనుగోలు చేయవచ్చును. షావోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 6000 తగ్గింపు ధరతో రూ. 27,999 అందించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 33,999. రెడ్మీ నోట్ 10 ఎస్ స్మార్ట్‌ఫోన్ రూ.1000 తగ్గింపు ధరతో రూ. 13,999 ధరకు అందించనుంది. అంతేకాకుండా అమెజాన్ పేతో కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్‌ను అందించనుంది. రియల్మీ సి 11 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ లాంచ్ చేయనుంది. లాంచ్ ధర రూ .6,999 కాగా ఈ సేల్ భాగంగా రూ. 6,699 కు అందించనుంది. -
Amazon Prime Day Sale: అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు ఇవే...
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. అమెజాన్ ఈ సేల్‌లో భాగంగా సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. పలు ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనుంది. హెచ్‌డీఎఫసీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ స్మార్ట్‌ఫోన్స్, ఫిట్నెస్ అక్సేసరీస్, టీవీలు, అమెజాన్ గ్యాడ్జెట్స్, అలెక్సా పవర్డ్ డివైజ్‌లపై భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్షిప్ సభ్యులకు మాత్రమే. అమెజాన్ ఫోన్లపై అందిస్తోన్న ఆఫర్లు వన్‌ప్లస్, శాంసంగ్, ఐక్యూ, షావోమీ కంపెనీల కొత్త ఉత్పత్తులు ప్రైమ్ డే సేల్‌లో లాంచ్ కానున్నాయి. పలు స్మార్ట్ ఫోన్లపై సుమారు రూ. 3000 కూపన్ ఆఫర్లను అందించనున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే స్మార్ట్ఫోన్లపై 6 నెలల స్క్రీన్ రిప్లెస్మెంట్ను ఇవ్వనుంది. టెక్నో స్మార్ట్ఫోన్లపై సుమారు 20శాతం పైగా డిస్కౌంట్స్. వివో స్మార్ట్ఫోన్లపై సుమారు 30 శాతం వరకు డిస్కౌంట్ దాంతో పాటు పాత ఫోన్ ఏక్సేచేంజ్పై సుమారు రూ. 2500 ఇవ్వనుంది. ఒప్పో ఫోన్లపై సుమారు 20శాతం వరకు డిస్కౌంట్, 12 నెలల నో కాస్ట్ ఈఎమ్ఐ. వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై ఎక్సేచేంజీపై సుమారు రూ. 5000 అందిస్తోంది. షావోమీ ఫోన్ల ఎక్సేచేంజీపై సుమారు రూ. 3000 దాంతో పాటుగా ఎంపిక చేసిన ఫోన్లపై ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ను ఇవ్వనుంది. ఫిట్నెస్ ట్రాకర్స్, ల్యాప్‌ట్యాప్‌లపై.. మొబైల్ ఆక్సేసరిస్ రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్‌ట్యాప్‌లపై సుమారు రూ. 35 వేల వరకు డిస్కౌంట్లను అందించనుంది. గేమింగ్, ఫిట్నెస్ ట్రాకర్స్‌పై సుమారు 60 శాతం వరకు డిస్కౌంట్లను ఇవ్వనుంది. హెడ్‌ఫోన్స్‌పై 75 శాతం వరకు, స్పీకర్స్, హై స్పీడ్ రూటర్స్, వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాల పై సుమారు 70 శాతం వరకు, డేటా స్టోరేజ్ డివైజ్‌లపై సుమారు 60 శాతం వరకు, కంప్యూటర్ కంపోనెంట్స్, మానిటర్స్‌పై సుమారు 50 శాతం వరకు తగ్గింపును కొనుగోలుదారులు ప్రైమ్ డే సేల్ భాగంగా పొందవచ్చును. హోమ్ ఆప్లియన్స్పై.. ఏసీలపై సుమారు 40 శాతం, రిఫ్రిజరేటర్లపై 30 శాతం, వాషింగ్ మెషిన్లపై సుమారు 30 శాతం, మైక్రో వేవ్స్‌పై 35 శాతం, 43, 40 ఇంచుల స్మార్ట్ టీవీలపై సుమారు 50 శాతం వరకు, 4కే టీవీలపై సుమారు 60 శాతం భారీ డిస్కౌంట్లను ఈ సేల్ పొందవచ్చును. -
అమెజాన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు తీపికబురును అందించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించింది. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్‌ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అమెజాన్ ప్రైమ్ ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రైమ్ డే సేల్‌లో బ్లాక్‌బస్లర్ డీల్స్‌తో పాటు, భారీ డిస్కౌంట్లను, సూపర్ సేవింగ్ డీల్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుంగా సుమారు 300కి పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కాగా జూలై 8 నుంచి జూలై 24 వరకు అమ్మకందారులతో అమెజాన్ ఒప్పందాలను కుదుర్చుకోనుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, వంటివి లాంచ్ చేయడమే కాకుండా వాటిపై భారీ ఆఫర్లను ప్రకటించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లక్షలాది స్థానిక వ్యాపారులకు లాక్డౌన్ నుంచి ఉపశమనం కల్గుతుందని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. #PrimeDay is here! 🤩 Save the dates 🗓 2️⃣6️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ – 2️⃣7️⃣•0️⃣7️⃣•2️⃣1️⃣ Celebrating 5 years of Prime in India, #DiscoverJoy with two days of savings, great deals, blockbuster entertainment, and much more. 🛍📽🎧 Read more 👉🏼 https://t.co/F4XfMbhcyT pic.twitter.com/UOyH4AU3DE — Amazon India News (@AmazonNews_IN) July 8, 2021 -
ఐఫోన్ ధర రూ.40వేల దాకా తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన ఐఫోన్ కోసం కలలుకంటున్న వారికి ఇది నిజంగా సువర్ణావకాశం. ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపులో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోలాహలంలో భాగంగా, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 6 ఎస్ , ఐఫోన్ 7లపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రైమ్ డే ఆఫర్లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ .40,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు రంగుల్లో లభిస్తున్న ఐఫోన్ ఎక్స్ఆర్ ఇంత కంటే తక్కువ ధరలో లభించడం కల్లేనేమో. అమెజాన్ ప్రైమ్‌డే సేల్ జూలై 15-16 తేదీలమధ్య జరగనుంది. ఈ విక్రయాల్లో సాధారణంగా ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కైంట్లను అందిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అమెజాన్ ఆపిల్ ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపుతో పాటు, వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ రియర్ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. -
బంపర్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే -2019
సాక్షి, న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మరోసారి తీపి కబురు చెప్పింది. ప్రైమ్ డే 2019 సేల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఈ మేరకు అమెజాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 15-19 తేదీల మధ్య నిర్వహించ నున్న ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా ఈసారి ప్రైమ్ డే సేల్ ను గ్లోబల్‌గా 48 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్ తదితర ప్రముఖ కంపెనీల టీవీలు, స్మార్ట్ఫోన్లు తదితర ఉత్పత్తులను ఈ సేల్‌లో తక్కువ ధరలకే తన ఫ్యాన్స్‌కు అందించనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌స క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై10శాతం ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్‌ను అందించనుంది. ఇండియా, అమెరికా, కెనడా, యుకె, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బెల్జియం, ఆస్ట్రియాదేశాలతో పాటు ఈ ఏడాది యూఏఈలో ఈ ప్రైమ్ డే సేల్ ను తొలిసారిగా పరిచయం చేస్తోంది. -
ప్రైమ్ డే : రూ.15 వేల కింద బెస్ట్ స్మార్ట్ఫోన్లివే!
అంతర్జాతీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జూలై 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్, నేటి అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండు ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, హోమ్ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. బెస్ట్ స్మార్ట్ఫోన్లకు కూడా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో 15 వేల రూపాయలకు కింద లభ్యమవుతున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏమిటో ఓ సారి చూద్దాం.. శాంసంగ్ గెలాక్సీ ఆన్8 - రూ.9,990(అసలు ధర రూ.13,490) నోకియా 5(16జీబీ) - రూ.11,599 (అసలు ధర రూ.15,299) ఎల్జీ క్యూ6ప్లస్ - రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 - రూ.12,990కు తగ్గింపు హానర్ 7ఎక్స్(64జీబీ) - రూ.13,999కు లభ్యం జియోని ఎం7 పవర్ - రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్(64జీబీ) - రూ.11,990కు తగ్గింపు ఒప్పో ఏ57(32జీబీ) - రూ.11,990(అసలు ధర రూ.14,990) ఆసుస్ జెన్‌ఫోన్4 సెల్ఫీ - రూ.7,999(అసలు ధర రూ.10,999) కార్బన్ ఫ్రేమ్స్ ఎస్9 - రూ.5,899(రూ.8,999) రెడ్మి వై2 స్మార్ట్‌ఫోన్ 32 జీబీ వేరియంట్ కూడా రూ.9999కు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వచ్చింది. హానర్ 7సీ కూడా రూ.9499కు, మోటో ఈ5 ప్లస్ కూడా రూ.11,999కు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా మోటో జీ5ఎస్ ప్లస్ 64జీబీ వేరియంట్‌పై 29 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు, పవర్ బ్యాంక్‌లు, స్క్రీన్ ప్రొటెక్టర్లు, కేసెస్, కవర్స్, డేటా కేబుల్స్ వంటి మొబైల్ యాక్ససరీస్‌పై సుమారు 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. -
నేటి నుంచే సేల్ : మొబైల్ ఫోన్లపై సగం ధర తగ్గింపు
బెంగళూరు : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, 36 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సేల్ ఆఫర్ కింద స్మార్ట్‌ఫోన్స్‌పై అమెజాన్ సుమారు సగం శాతం మేర ధరలు తగ్గిస్తోంది. మొబైల్ ఫోన్లపై 40 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రైమ్ డే సేల్‌లో, వన్‌ప్లస్, హెచ్‌పీ, ఏసర్ వంటి టాప్ బ్రాండ్లు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయబోతున్నాయి. ప్రైమ్ మెంబర్లు క్విజ్‌లో పాలుపంచుకుని, వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, మోటో జీ6 వంటి వాటిపై సమర్థవంతమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు, హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై 3వేల రూపాయల వరకు ధర తగ్గింపు, నోట్8పై రూ.10 వేల ధర తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. హానర్ 7సీ, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, హువావే పీ20 ప్రొ, లైట్, వివో వీ7ప్లస్, వివో వీ9 స్మార్ట్ఫోన్లు కూడా ఆఫర్లో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా యాక్ససరీస్‌పై కూడా 80 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్, కేసెస్ అండ్ కవర్స్, డేటా కేబుల్స్ వంటి వాటిపై 80 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది.ఇ-కామర్స్ సైట్ అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రిడెట్, డెబిట్ కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ పే కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోందని కంపెనీ వెల్లడించింది. పాత ఫోన్ల మార్పులపై రూ. 3000 ఆఫర్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్ : బిగ్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను లాంచ్ చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ప్రత్యకంగా అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే. ఈ స్పెషల్ సేల్ ఆఫర్ జులై 16 మధ్యాహ్నం నుండి జులై 18 అర్థరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 200లకు పైగా కొత్త ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. వన్‌ప్లస్, బాష్ ఇంటల్, హెచ్‌పీ, తదితర ఉత్పత్తులను డిస్కౌంట్ ధరల్లో ఆఫర్ చేయనుంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఇకో స్పీకర్లుతదితరాలపై వేలకొద్దీ ఆఫర్లను సిద్ధం చేసింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఇతర యాక్ససరీస్ 40శాతం దాకా డిస్కౌంట్.. స్మార్టఫోన్ విభాగంలో శాంసంగ్, షావోమి, మోటో, హానర్, రియలల్మీ , హువాయ్, ఆపిల్, నోకియా, టెనోర్, ఎల్జీ వివో బ్రాండ్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ద్వారా 3వేల దాకా క్యాష్ బ్యాక్ కూడా లభ్యం. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ పే వినియోగదారులకు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇంకా, ప్రైమ్ డే సమయంలో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌ను ప్రత్యేకంగా ప్రారంభించనుంది. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, గుజరాతీ, రాజస్థానీ, బెంగాలీ సహా మరో రెండు కొత్త భాషలు అస్సామీ & ఒడియ లాంటి భారతీయ భాషలలో ప్రత్యేకంగా ప్లే జాబితాలు ప్రారంభించనుంది. అయితే ప్రతి ఏడాదిలా 24 గంటలు సేల్ కాకుండా ఈ సారి 36 గంటలు పాటు ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహించడం విశేషం. 'అల్ట్రా-ఫాస్ట్ 2-గంటల డెలివరీ' కూడా అని అమెజాన్ ప్రకటించింది. -
అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ మరోసారి
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ముచ్చటగా మూడోసారి ప్రైమ్ డే డీల్స్‌ను త్వరలో ప్రారంభించనుంది. గత రెండేళ్లుగా ప్రైమ్ డే డీల్స్ ద్వారా భారీ విక్రయాలపై కన్నేసిన అమెజాన్ మరోసారి జూలై 10 సాయంత్రం నుంచి స్పెషల్ అమ్మకాలకు తెరతీయనుంది. అమెజాన్ లో ప్రైమ్ సభ్యత్వం ఉన్న సభ్యుల కోసం ఈ ఏడాది ప్రైమ్ డే డీల్స్ అమ్మకాలు 30 గంటలు కొనసాగుతాయని అమెజాన్ ప్రకటించింది. గత సంవత్సరం ప్రకటించిన ప్రైమ్ డే డీల్స్ బంపర్ విజయం సాధించడంతో మరోసారి ఈ ప్రైమ్ డీల్స్ ప్రకటించిది. అయితే గత ఏడాది కేవలం 24 గంటలు మాత్రమే విక్రయాలను కొనసాగించగా ఈసారి ఈ సమయాన్ని 30 గంటలకు పొడిగించడం విశేషం. గత రెండేళ్లుగా ప్రైమ్ డే డీల్స్‌పై తమ సభ్యుల స్పందన తమకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అమెజాన్ ప్రైమ్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ గ్రీలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంకూడా మరింత మెరుగైన ఆఫర్స్ తీసుకొచ్చేందుకు ప్రేరణ కలిగిందని చెప్పారు. ప్రతి అయిదు నిమిషాలకు ఒక కొత్త డీల్ ఉంటుందని తెలిపారు. ఈ బిగ్ సేల్ లో పాలు పంచుకోవాలంటే ప్రైమ్ సభ్యత్వంకోసం జూలై 11న లేదా అంతకు ముందుగానీ రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. గతంలో ఈప్రైమ్ డీల్ సేల్ లో రోజువారీ కంటే 20 రెట్ల అమ్మకాలను సాధించిన అమెజాన్ మరి ఈ సారి ఎలాంటి బంపర్ బొనాంజా కొట్టేయనుందో చూడాలి.