ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు | Apple iPhone India prices slashed, up to Rs 40000 off | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

Published Sat, Jul 13 2019 4:49 PM | Last Updated on Sat, Jul 13 2019 8:01 PM

Apple iPhone India prices slashed, up to Rs 40000 off - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : ఖరీదైన ఐఫోన్‌  కోసం కలలుకంటున్న వారికి ఇది నిజంగా సువర్ణావకాశం.  ఆపిల్‌  లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపులో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ డే  సేల్‌  కోలాహలంలో భాగంగా, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 6 ఎస్ , ఐఫోన్ 7లపై  భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

ముఖ్యంగా ఈ ప్రైమ్ డే ఆఫర్‌లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ రూ .40,000 వరకు డిస్కౌంట్  అందిస్తోంది.  ఆరు రంగుల్లో లభిస్తున్న  ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఇంత కంటే తక్కువ ధరలో లభించడం కల్లేనేమో. అమెజాన్‌ ప్రైమ్‌డే  సేల్‌ జూలై 15-16 తేదీలమధ్య  జరగనుంది.  ఈ  విక్రయాల్లో   సాధారణంగా ఆపిల్‌ ఉత‍్పత్తులపై భారీ డిస్కైంట్లను అందిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అమెజాన్‌ ఆపిల్‌ ఇతర ఉత్పత్తులపై  భారీ తగ్గింపుతో పాటు,  వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లను అందించనుంది. 

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ  రియర్‌ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్‌, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో  తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement