
అమెజాన్ ప్రైమ్ డే సేల్ (ప్రతీకాత్మక చిత్రం)
బెంగళూరు : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, 36 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సేల్ ఆఫర్ కింద స్మార్ట్‌ఫోన్స్‌పై అమెజాన్ సుమారు సగం శాతం మేర ధరలు తగ్గిస్తోంది. మొబైల్ ఫోన్లపై 40 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రైమ్ డే సేల్‌లో, వన్‌ప్లస్, హెచ్‌పీ, ఏసర్ వంటి టాప్ బ్రాండ్‌లు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయబోతున్నాయి. ప్రైమ్ మెంబర్లు క్విజ్‌లో పాలుపంచుకుని, వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, మోటో జీ6 వంటి వాటిపై సమర్థవంతమైన ఎక్స్చేంజ్ ఆఫర్లు, హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై 3వేల రూపాయల వరకు ధర తగ్గింపు, నోట్8పై రూ.10 వేల ధర తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. హానర్ 7సీ, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, హువావే పీ20 ప్రొ, లైట్, వివో వీ7ప్లస్, వివో వీ9 స్మార్ట్‌ఫోన్లు కూడా ఆఫర్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా యాక్ససరీస్‌పై కూడా 80 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది. పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్, కేసెస్ అండ్ కవర్స్, డేటా కేబుల్స్ వంటి వాటిపై 80 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది.ఇ-కామర్స్ సైట్ అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రిడెట్, డెబిట్ కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ పే కస్టమర్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోందని కంపెనీ వెల్లడించింది. పాత ఫోన్ల మార్పులపై రూ. 3000 ఆఫర్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment