ప్రైమ్‌ డే : రూ.15 వేల కింద బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లివే! | Best Smartphones Under Rs 15000 On Amazon Prime Day Sale | Sakshi
Sakshi News home page

ప్రైమ్‌ డే : రూ.15 వేల కింద బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లివే!

Published Tue, Jul 17 2018 12:06 PM | Last Updated on Tue, Jul 17 2018 12:34 PM

Best Smartphones Under Rs 15000 On Amazon Prime Day Sale - Sakshi

రూ.15 వేల కంటే తక్కువకు లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్లు

అంతర్జాతీయ ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ తన ప్రైమ్‌ డే సేల్‌ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జూలై 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్‌, నేటి అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండు ఉత్పత్తులపై కూడా ఉత్తమమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రకటించింది. ఫ్యాషన్‌, లైఫ్‌స్టయిల్‌, హోమ్‌ డెకర్ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్ల వరకు భారీ మొత్తంలో డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లకు కూడా బడ్జెట్‌ ధరలో లభ్యమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో 15 వేల రూపాయలకు కింద లభ్యమవుతున్న బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు ఏమిటో ఓ సారి చూద్దాం..

  • శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌8 - రూ.9,990(అసలు ధర రూ.13,490)
  • నోకియా 5(16జీబీ) - రూ.11,599 (అసలు ధర రూ.15,299)
  • ఎల్‌జీ క్యూ6ప్లస్‌ - రూ.19,990 నుంచి రూ.12,990కు తగ్గింపు
  • శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 - రూ.12,990కు తగ్గింపు
  • హానర్‌ 7ఎక్స్‌(64జీబీ) - రూ.13,999కు లభ్యం
  • జియోని ఎం7 పవర్‌ - రూ.18,279 నుంచి రూ.10,999కు తగ్గింపు 
  • శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌(64జీబీ) - రూ.11,990కు తగ్గింపు
  • ఒప్పో ఏ57(32జీబీ) - రూ.11,990(అసలు ధర రూ.14,990)
  • ఆసుస్‌ జెన్‌ఫోన్‌4 సెల్ఫీ - రూ.7,999(అసలు ధర రూ.10,999)
  • కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌9 - రూ.5,899(రూ.8,999)

రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్‌ 32 జీబీ వేరియంట్‌ కూడా రూ.9999కు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి వచ్చింది. హానర్‌ 7సీ కూడా రూ.9499కు, మోటో ఈ5 ప్లస్‌ కూడా రూ.11,999కు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా మోటో జీ5ఎస్‌ ప్లస్‌ 64జీబీ వేరియంట్‌పై 29 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. మొబైల్‌ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు, పవర్‌ బ్యాంక్‌లు, స్క్రీన్‌ ప్రొటెక్టర్లు, కేసెస్‌, కవర్స్‌, డేటా కేబుల్స్‌ వంటి మొబైల్‌ యాక్ససరీస్‌పై సుమారు 80 శాతం డిస్కౌంట్లను అమెజాన్‌ అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement