అమెజాన్‌ ప్రైమ్‌ డే డీల్స్‌ మరోసారి | Amazon Prepares for 30 Hours of Prime Day Deals | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌ డే డీల్స్‌ మరోసారి

Published Thu, Jun 29 2017 7:01 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

అమెజాన్‌ ప్రైమ్‌ డే డీల్స్‌ మరోసారి

అమెజాన్‌ ప్రైమ్‌ డే డీల్స్‌ మరోసారి

న్యూఢిల్లీ:  ఈ కామర్స్‌ దిగ్గజం   అమెజాన్‌  ముచ్చటగా మూడోసారి ప్రైమ్‌ డే డీల్స్‌ను త్వరలో ప్రారంభించనుంది.  గత  రెండేళ్లుగా ప్రైమ్‌ డే డీల్స్‌ ద్వారా భారీ విక్రయాలపై కన్నేసిన అమెజాన్‌ మరోసారి జూలై 10 సాయంత్రం నుంచి స్పెషల్‌ అమ్మ​కాలకు  తెరతీయనుంది.  అమెజాన్‌ లో  ప్రైమ్‌   సభ్యత్వం ఉన్న సభ్యుల కోసం ఈ ఏడాది ప్రైమ్ డే డీల్స్‌  అమ్మకాలు 30 గంటలు కొనసాగుతాయని అమెజాన్‌ ప్రకటించింది. 

గత సంవత్సరం  ప్రకటించిన ప్రైమ్‌ డే డీల్స్‌ బంపర్‌ విజయం సాధించడంతో మరోసారి    ఈ ప్రైమ్‌ డీల్స్‌  ప్రకటించిది.  అయితే గత ఏడాది  కేవలం  24 గంటలు మాత్రమే   విక్రయాలను కొనసాగించగా  ఈసారి  ఈ సమయాన్ని 30 గంటలకు పొడిగించడం విశేషం. గత రెండేళ్లుగా   ప్రైమ్‌ డే డీల్స్‌పై తమ సభ్యుల స్పందన తమకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అమెజాన్ ప్రైమ్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ గ్రీలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో  ఈ సంవత్సరంకూడా మరింత మెరుగైన ఆఫర్స్‌ తీసుకొచ్చేందుకు  ప్రేరణ  కలిగిందని చెప్పారు.  ప్రతి అయిదు నిమిషాలకు ఒక కొత్త డీల్‌  ఉంటుందని  తెలిపారు. ఈ బిగ్‌ సేల్‌ లో  పాలు పంచుకోవాలంటే  ప్రైమ్‌ సభ్యత్వంకోసం  జూలై 11న లేదా అంతకు ముందుగానీ  రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. గతంలో  ఈప్రైమ్‌ డీల్‌ సేల్‌ లో రోజువారీ కంటే  20 రెట్ల అమ్మకాలను సాధించిన అమెజాన్‌ మరి ఈ సారి ఎలాంటి  బంపర్‌ బొనాంజా కొట్టేయనుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement