అమెజాన్‌కి కౌంటర్‌: ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌ | Flipkart Mobile Bonanza Sale 2019 | Sakshi

అమెజాన్‌కి కౌంటర్‌: ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌

Mar 25 2019 2:36 PM | Updated on Mar 25 2019 2:42 PM

Flipkart Mobile Bonanza Sale 2019  - Sakshi

సాక్షి, ముంబై:  ఆన్‌లైన్‌ రీటైల్‌ దిగ్గజాలు వరుస ఆఫర్లతో  స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికులకు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్‌ ఫెస్ట్‌ సేల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ బొనాంజా సేల్‌ -2019ను  సోమవారం  ప్రకటించింది.  మార్చి 28వరకు వరుసగా నాలుగురోజులపాటు ఈ సేల్‌ ఉంటుంది.   నో కాస్ట్‌  ఈఎంఐ, క్యాష్‌బ్యాక్స్‌ లను వినియోగదారులకు ఆఫర్‌ చేస్తోంది.  దీంతోపాటు  యాక్సిస్‌ బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై  5 శాతం  అదనపు డిస్కౌంట్‌ను  కూడా ఇవ్వనుంది.

ముఖ్యంగా షావోమి రెడ్‌మి నో 6 ప్రొ, రెడ్‌మి 6 , పోకో ఎఫ్‌ 1 లను తక్కువ ధరకే అందిస్తోంది.  అలాగే రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా శాంసంగ్‌  గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఏ 50, గెలాక్సీ ఏ 10, తోపాటు హానర్‌ 9 లైట్‌, హానర్‌ 9ఎన్‌, హానర్‌ 10   లైట్‌   స్మార్ట్‌ఫోన్లు  ఫ్లిప్‌కార్ట్‌ తాజా మొబైల్‌ మొనాంజా సేల్‌ 2019లో లిస్ట్‌ అయి వుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement