
హైదరాబాద్: న్యూ ఐఫోన్ 12 మినీపై మెగా డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. మార్కెట్‌లో ఈ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర 69,900లు ఉండగా డీల్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 7,000 డిస్కౌంట్ వస్తోంది. దీంతో పాటు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా గరిష్టంగా మరో రూ. 15,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
స్మాల్‌డిస్‌ప్లే
ప్రస్తుత ట్రెండ్‌కి భిన్నంగా ఈ మొబైల్ డిస్ ప్లే సైజు చిన్నగా డిజైన్ చేసింది. జేబులో ఇమిడిపోయే సైజులో 5.4 అంగులాల డిస్‌ప్లేతో ఈ మొబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. చిన్న సైజు మొబైల్ ఫోన్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో మెజారిటీ ఫోన్లు 6 అంగులాల డిస్‌ప్లే తోనే వస్తున్నాయి.
ఫీచర్స్
12 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ ప్రైమరీ కెమెరా, వైడ్ కెమెరాలతో పాటు 12 మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా విత్ నైట్ మోడ్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌తో 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. న్యూ ఆప్ లైబ్రరీ, కొత్తం రకం హోం స్క్రీన్ విడ్జెట్స్ తదితర ఆప్షన్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment