Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం | Amazon Retail Launches Agronomy Technology Services For Farmers | Sakshi
Sakshi News home page

Amazon Retail: రైతుల కోసం అగ్రోనమీ.. టెక్నికల్‌ నాలెడ్జ్‌తో వెన్నుదన్ను

Published Wed, Sep 1 2021 5:14 PM | Last Updated on Wed, Sep 1 2021 5:14 PM

Amazon Retail Launches Agronomy Technology Services For Farmers - Sakshi

భారత్‌లో అన్ని రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు టెక్‌ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెజాన్‌ రిటైల్‌, రైతుల కోసం అగ్రోనమీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. టెక్నాలజీ సంబంధిత ఈ సర్వీసుల ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, నిర్ణయాలు, వాళ్ల నుంచి విలువైన సూచనలు తీసుకుని మరికొందరు రైతులకు అందించే ఉద్దేశంతో ఆగ్రోనమీని మొదలుపెట్టింది. 
 

రైతులకు మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని అందించడంతో పాటు ఉత్పత్తిని మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకే ఈ అగ్రోనమీ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు అమెజాన్‌ ఇండియా గ్రాసరీ, ఫుడ్‌ అండ్‌ హెల్త్ డైరెక్టర్‌ సమీర్‌ ఖేతర్‌పాల్‌ వెల్లడించారు. అగ్రోనమీ సేవలతో పాటు వ్యవసాయం పరిశోధకులను, నిర్వాహకుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయనుంది అమెజాన్‌. శిక్షణ పొందిన రైతుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వాళ్లను.. మరికొందరికి శిక్షణ ఇచ్చే నిర్వాహకులుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. 

గత దశాబ్దకాలంగా వ్యవసాయంలో టెక్నాలజీ పాత్ర పెరిగింది. ఈ తరుణంలో రైతులకు తోడ్పాటుగా నిలవడం ద్వారా అగ్రో సెక్టార్‌లోనూ ముందుకెళ్లాలని భావిస్తోంది అమెజాన్‌. మట్టి, వాతావరణాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సూచనలు అందించే టెక్నాలజీని సైతం త్వరలో అగ్రోనమీ ప్రాజెక్టులో చేర్చనున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

చదవండి: దేశంలో ఆగిపోనున్న వీపీఎన్‌ సర్వీసులు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement