హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ/స్టార్ట్ కార్యక్రమాన్ని భారత్‌లో ప్రారంభించింది. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఔత్సాహికులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ ఇస్తారు. 12 వారాలపాటు సాగే ఈ ఆన్‌లైన్ ప్రోగ్రాంకు ఎటువంటి సాంకేతిక అనుభవం అవసరం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్ ప్రారంభించేందుకు ఇది దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. యూఎస్, యూకేతోపాటు ప్ర పంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఇప్పటికే రీ/స్టార్ట్ కార్యక్రమం నిర్వహించారు.
మల్టీక్లౌడ్‌కు భారీ అవకాశాలు
దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్లకు భారీ అవకాశాలున్నట్లు యూఎస్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వీఎంవేర్ తాజాగా అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్వహించిన వీఎంవరల్డ్ 2021 సదస్సులో పలు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పలు సంస్థలు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రయాణం రెండో దశలో ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు క్లౌడ్‌స్మార్ట్‌గా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్ల మార్కెట్ అత్యంత వృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడింది.
దేశీ మార్కెట్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వీఎంవేర్ ప్రెసిడెంట్ సుమీత్ ధావన్ వెల్లడించారు. తమ మల్టీక్లౌడ్ సొల్యూషన్లనకు పలు అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఐదేళ్ల కాలంలో దేశీ మార్కెట్లో రెండు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2018లోనే వీఎంవేర్ ప్రకటించింది. తద్వారా కార్యకలాపాల విస్తరణ, ఉపాధి కల్పను తెరతీయను
Comments
Please login to add a commentAdd a comment