Cloud Computing Service
-
డిజిటల్ సెక్టార్లో భారీ ఉద్యోగాలు!
ముంబై: జావా, క్లౌడ్, డేటా అనలిటిక్స్, ప్లాట్‌ఫాం టెక్నాలజీల్లాంటి డిజిటల్ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్ పెరిగిందని డేటా కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ట్ కార్ప్ ఒక నివేదికలో వెల్లడించింది. గత త్రైమాసికం నుంచి ఈ ధోరణి గణనీయంగా కనిపిస్తోందని పేర్కొంది. టెక్నాలజీలో ప్రతిభావంతులను దక్కించుకునేందుకు సంస్థల మధ్య అసాధారణ పోటీ నెలకొందని వివరించింది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతున్న పరిస్థితుల్లో.. వివిధ రంగాల కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్ధుల దరఖాస్తులు, ఉద్యోగాల ఖాళీలను సరిపోల్చి చూసే తమ అప్లికేషన్ ట్రాకింగ్ వ్యవస్థలోని డేటా ఆధారంగా క్వెస్ట్ కార్ప్ దీన్ని రూపొందించింది. జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో ధోరణులను సెప్టెంబర్–నవంబర్ మధ్య కాలంతో పోల్చి ఈ నివేదికను తయారు చేశారు. రిక్రూట్మెంట్కి డిమాండ్ ఈ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు కూడా రెండంకెల స్థాయి వృద్ధి సాధిస్తున్నాయి. దీంతో గతంతో పోలిస్తే మరింత భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. రాజీనామాల ద్వారా పెరిగే ఖాళీల సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ సంస్థలకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ఇన్సైట్ ప్రకారం దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమకి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో స్థూలంగా 4,50,000 మంది పైచిలుకు సిబ్బంది జతకానున్నట్లు క్వెస్ట్ కార్ప్ తెలిపింది. డిజిటల్ డీల్స్ ఊతం.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో డిజిటల్ నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. టాప్ 5 టెక్నాలజీల్లో ఎప్పట్లాగే జావా కొనసాగుతుండగా .. క్లౌడ్ ఇన్ఫ్రా, డేటా అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ భారీగా నెలకొంది. డిజిటల్‌కు మారేందుకు సంస్థలు భారీ స్థాయిలో డీల్స్ కుదు ర్చుకుంటూ ఉండటం, హైబ్రిడ్ క్లౌడ్ వినియోగం మొదలైనవి 2021 ఆఖర్లో వ్యాపారాల పనితీరు మెరుగుపడేందుకు, నియామకాలు పెరిగేందుకు దోహదపడ్డాయని క్వెస్ట్ కార్ప్ పేర్కొంది. చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!! -
గుడ్ న్యూస్, అమెజాన్‌లో ఆ టెక్నాలజీపై ఉచితంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీ/స్టార్ట్ కార్యక్రమాన్ని భారత్‌లో ప్రారంభించింది. ఇందులో భాగంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఔత్సాహికులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ ఇస్తారు. 12 వారాలపాటు సాగే ఈ ఆన్లైన్ ప్రోగ్రాంకు ఎటువంటి సాంకేతిక అనుభవం అవసరం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరీర్ ప్రారంభించేందుకు ఇది దోహదం చేస్తుందని కంపెనీ తెలిపింది. యూఎస్, యూకేతోపాటు ప్ర పంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఇప్పటికే రీ/స్టార్ట్ కార్యక్రమం నిర్వహించారు. మల్టీక్లౌడ్కు భారీ అవకాశాలు దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్లకు భారీ అవకాశాలున్నట్లు యూఎస్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వీఎంవేర్ తాజాగా అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్వహించిన వీఎంవరల్డ్ 2021 సదస్సులో పలు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా పలు సంస్థలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయాణం రెండో దశలో ఉన్నట్లు పేర్కొంది. కంపెనీలు క్లౌడ్స్మార్ట్గా ఆవిర్భవించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా మల్టీక్లౌడ్ సొల్యూషన్ల మార్కెట్ అత్యంత వృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడింది. దేశీ మార్కెట్లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వీఎంవేర్ ప్రెసిడెంట్ సుమీత్ ధావన్ వెల్లడించారు. తమ మల్టీక్లౌడ్ సొల్యూషన్లనకు పలు అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఐదేళ్ల కాలంలో దేశీ మార్కెట్లో రెండు బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2018లోనే వీఎంవేర్ ప్రకటించింది. తద్వారా కార్యకలాపాల విస్తరణ, ఉపాధి కల్పను తెరతీయను -
అమెరికన్ స్టార్టప్ నుంచి.. ఉద్యోగాలు
అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ క్లమియో ఇండియాలో తన సెంటర్‌ను ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. క్లమియో కంపెనీ బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్లో సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్(ఎస్ఏఏఎస్) ఆధారిత డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఇండియాలో ఇప్పటికే ఈ కంపెనీలో 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు క్లమియో వెల్లడించింది. కాగా 2017లో పూజన్ కుమార్, కౌస్తభ్ పాటిల్, ఊన్ జంగ్ అనే ముగ్గురు కలిసి క్యాలిఫోర్నియాలోని శాంటాక్లారా లో క్లమియో స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురు కలిసి సుమారు రూ.1,400 కోట్ల నిధులను సమీకరించారు. క్లౌడ్ ఆధారిత పలు ఏడబ్ల్యూఎస్ సర్వీసుల్ని అందిస్తుంది. ప్రస్తుతమేగాక భవిష్యత్తులోనూ బ్యాక్అప్ అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. మా కంపెనీ గ్లోబల్ టీమ్‌కు సాహయకారిగానేగాక ఫ్రంట్ ఎండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఓరియెంటేషన్‌లో క్లౌడ్ సొల్యూషన్స్‌ను అందిస్తుందని తెలిపింది. దీనిలో ఇంజినీరింగ్ టీమ్‌లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఇండియాలో చాలామంది టెక్నాలజీ నైపుణ్యం కలిగి వారు ఉన్నారని క్లుమియో జీఎం అండ్ ఇంజనీరింగ్ వీపీ సందీప్సోని అన్నారు. ఇక్కడ ల్యాండ్‌లైన్ కమ్యూనికేషన్స్ నుంచి సెల్ఫోన్ల విప్లవం ఎలా వచ్చిందో అదేవిధంగా తరువాతి తరం తమ నైపుణ్యంతో సాఫ్ట్‌వేర్‌ను విస్తృతంగా అభివృద్ధి చేస్తుందని సందీప్ ఒక ప్రకటనలో అన్నారు. ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో కొత్త నియమకాలు చేపట్టనుంది. -
భారత్‌లో ఐబీఎం క్లౌడ్ డేటా సెంటర్
కంపెనీ కంట్రీ హెడ్ (క్లౌడ్ కంప్యూటింగ్) వంశీ చరణ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం భారత్‌లో ప్రత్యేకంగా క్లౌడ్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది ఆఖర్లోగా ఇది అందుబాటులోకి రాగలదని కంపెనీ కంట్రీ హెడ్(క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం) వంశీ చరణ్ ముడియం బుధవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. అనువైన స్థలం అన్వేషణలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమకు ప్రపంచవ్యాప్తంగా 13 క్లౌడ్ డేటా సెంటర్లు ఉన్నాయని.. ఈ సంఖ్యను 40కి పెంచుకుంటున్నామని వివరించారు. దీనికి 1.2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. భారత్ సహా చైనా, జపాన్, కెనడా తదితర దేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశీ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులు, సర్వీసులను ప్రవేశపెట్టడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వంశీచరణ్ వివరించారు. క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్నాళ్లలో 7 బిలియన్ డాలర్లు వెచ్చించి 17 క్లౌడ్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. భారత్‌లో పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల మార్కెట్ ఈ ఏడాది సుమారు 29.8 శాతం పెరిగి 550 మిలియన్ డాలర్లకు పెరగగలదని, 2017 నాటికి 4 బిలియన్ డాలర్లకు చేరగలదని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనా.