
డెల్టా వేరియంట్ కేసుల కారణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వచ్చే ఏడాది వరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. ప్రపంచదేశాల్లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు 135 దేశాలకు వ్యాపించినట్లు ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరించారు.
మరోవైపు అమెరికాలో సైతం డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండడంతో అమెజాన్‌లో పనిచేసే ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నెల వరకు అందరూ వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించింది. వాస్తవానికి వర్క్ ఫ్రం హోం ఈ ఏడాది సెప్టెంబర్ నెలతో ముగియనున్నాయి. కానీ పెరుగుతున్న డెల్టా కేసులు దృష్ట్యా ఆ సమయాన్ని అమెజాన్ పొడిగించింది.
ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధులు మాట్లాడుతూ.."దేశంలోని కోవిడ్ పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. సెప్టెంబర్ 7,2021 వరకు ఉద్యోగులు ఇంట్లోనే విధులు నిర్వహించేలా మెయిల్ పెట్టాము. సెప్టెంబర్ 8నుంచి కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ మార్గదర్శకాల్ని సరిచేస్తున్నాం.జనవరి 3, 2022 వరకు వర్క్ ఫ్రం హోం విధులు కొనసాగించాలని ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు" చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment