మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రాన్ని స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీశారు. మొదటినుంచి ఈ చిత్రం ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి చూపించారు. కానీ మొత్తం రివర్స్‌లో జరిగింది. దీంతో మూవీ టీమ్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!)
సినిమా అనేది ఎంటర్ టైన్‍మెంట్. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు సినిమా కరెక్ట్ లెంగ్త్‌లో ఉంటే పర్లేదు. ఏ మాత్రం వేరుగా ఉన్నా మొదటికే మోసం వచ్చే ఛాన్సు ఉంటుంది. 'టైగర్ నాగేశ్వరరావు' విషయంలో అదే జరిగినట్లు కనిపిస్తుంది. తొలుత ప్రకటించినప్పుడు 3 గంటల నిమిషం 39 సెకన్ల నిడివితో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంత నిడివి ఓకేనా? అని పలువురు అనుకున్నారు.
తీరా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ నిడివి ఇప్పుడు సమస్యగా మారింది. సెకండాఫ్‌లో ల్యాగ్ అవ్వడానికి ఇదే కారణమని ఒక్కరోజులోనే చిత్రబృందం గుర్తించింది. దీంతో దాదాపు 24 నిమిషాల సీన్లని కట్ చేసి పడేశారు. ఇకపై 2 గంటల 37 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు తొలిరోజు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. మరి నిడివిలో మార్పు ఏమైనా ఫలితాన్ని మారుస్తుందా అనేది చూడాలి? అయితే ఈ పని ముందే చేసుంటే బాగుండేదని సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)
#TigerNageswaraRao - a racy tale of India's Biggest Thief with a cinematic experience of 2 Hours 37 Minutes 💥💥
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023
Enjoy the ROARING DASARA WINNER in cinemas near you ❤️🔥
BOOK YOUR TICKETS NOW 🐅
- https://t.co/yOg5E0c9LP@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl… pic.twitter.com/GOHZOSAAnA
Comments
Please login to add a commentAdd a comment