వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం హీరో రవితేజ‍.. సరికొత్త రికార్డ్ | Actor Raviteja Commentry For ODI World Cup 2023 Ind vs Aus | Sakshi
Sakshi News home page

Raviteja World Cup 2023: వరల్డ్‌కప్‌లో రవితేజ కామెంట్రీ.. కోహ్లీలో అదంటే ఇష్టమట!

Published Sun, Oct 8 2023 4:40 PM | Last Updated on Sun, Oct 8 2023 5:13 PM

Actor Raviteja Commentry For ODI World Cup 2023 Ind vs Aus - Sakshi

మాస్ మహారాజ్ రవితేజ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం కామెంట్రీ చేసిన ఇతడు.. సినిమా విశేషాలతో పాటు మ్యాచ్ గురించి మాట్లాడాడు. అలానే టీమిండియాలో కోహ్లీతో మరో క్రికెటర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంతకీ ఏంటి సంగతి?

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది. అయితే తెలుగు కామెంటరీ బాక్సులో కనిపించిన రవితేజ.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, సిరాజ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇకపోతే కోహ్లీ యాటిట్యూడ్, అగ్రెషన్, లుక్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అలానే ఈ మ్యాచ్‌లో క్యాచ్ పట్టిన స్టైల్ నచ్చిందని కామెంట్రీ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?)

అయితే గతంలో ఐపీఎల్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇలా కామెంటరీ బాక్సులో కాదు గానీ స్టేడియంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రవితేజ మాత్రం ఏకంగా వరల్డ్‌కప్ మ్యాచ్ కోసం కామెంటరీ చేశాడు. అయితే ఓ తెలుగు హీరో ఇలా ప్రపంచకప్ మ్యాచ్‌కి కామెంటరీ చేయడం ఇదే తొలిసారి. ఇలా ఎవరికీ సాధ్యపడని ఘనత సాధించాడు.

స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అక్టోబరు 20న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement