
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఆ చిత్రం ద్వారానే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడిపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉండగానే 2003లో పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అదే రేణూ దేశాయ్ చివరి చిత్రం. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలు.. విడాకులు ఇలా రేణూ దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. దీంతో ఆమె మళ్లీ తిరిగి సినిమాల వైపు చూడలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు రేణూ దేశాయ్.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రాలలో టైగర్ నాగేశ్వరరావు ఒకటి. 1970లో స్టూవర్టుపురంలోని టైగర్ నాగేశ్వరరావు అనే ఒక దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ.ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను రేణు దేశాయ్ పోషిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకి సంబంధించిన లుక్ ను .. వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'హేమలత లవణం' పాత్రలో కనిపిస్తారనీ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment