టైగర్‌ నాగేశ్వరరావు: హేమలతగా రేణు దేశాయ్‌, పోస్టర్‌ అవుట్‌ | Tiger Nageswara Rao: Renu Desai as Hemalatha Lavanam, Poster Out | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao: ఎమోషనల్‌ లుక్‌లో రేణు దేశాయ్‌.. పోస్టర్‌ చూశారా?

Published Sun, Oct 1 2023 3:37 PM | Last Updated on Sun, Oct 1 2023 3:56 PM

Tiger Nageswara Rao: Renu Desai as Hemalatha Lavanam, Poster Out - Sakshi

ఇన్నాళ్ల తర్వాత రేణు దేశాయ్‌ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన నిర్మలమైన నవ్వు, ప్రశాంతతను కురిపించే కళ్లు.. ఏవీ

మాస్‌ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. 1970లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు చుట్టూ ఈ కథ సాగుతుంది. వంశీకృష్ణనాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రవితేజ సిగరెట్‌ తాగుతున్నట్లుగా పోస్టర్‌ రిలీజ్‌ చేయగా విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రం నుంచి నటి రేణు దేశాయ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్రను పోషిస్తోంది. చేతిలో చంటిబాబును ఎత్తుకుని అతడిని చూసి మురిసిపోతున్నట్లుగా ఉంది రేణు దేశాయ్‌ లుక్‌. క్షణాల్లో ఈ పోస్టర్‌ వైరల్‌గా మారగా.. ఇన్నాళ్ల తర్వాత రేణు దేశాయ్‌ వెండితెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన నిర్మలమైన నవ్వు, ప్రశాంతతను కురిపించే కళ్లు.. ఏవీ మారలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ నెల 3న ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా.

చదవండి: హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement