#RT71: Ravi Teja New Movie Tiger Nageswara Rao Update | గజదొంగ బయోపిక్‌లో రవితేజ.. - Sakshi
Sakshi News home page

#RT71: గజదొంగ బయోపిక్‌లో రవితేజ..ఎవరీ టైగర్ నాగేశ్వరరావు?

Published Wed, Nov 3 2021 12:59 PM | Last Updated on Thu, Mar 9 2023 3:49 PM

Ravi Teja 71: Ravi Teja New Film Announcement Titled As Tiger Nageswara Rao - Sakshi

Tiger Nageswara Rao Ravi Teja Movie Update: మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘క్రాక్‌’ తర్వాత  ఏకంగా మూడు సినిమాలు ప్రకటించిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ తన 71వ సినిమాను కూడా ప్రకటించాడు.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement