
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఓ ఫైట్ చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయమై, పది కుట్లు పడ్డాయని తెలిసింది.
కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పినప్పటికీ రవితేజ ‘నో రెస్ట్’ అంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఇతర నటీనటుల డేట్స్‌ని దృష్టిలో పెట్టుకుని, తన కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలగకూడదని రవితేజ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment