కారైకుడిలో మిస్టర్‌ బచ్చన్‌  | Ravi Teja off to Karaikudi with Harish Shankar for filming of Mr Bachchan | Sakshi
Sakshi News home page

కారైకుడిలో మిస్టర్‌ బచ్చన్‌ 

Published Fri, Jan 26 2024 3:30 AM | Last Updated on Fri, Jan 26 2024 3:30 AM

Ravi Teja off to Karaikudi with Harish Shankar for filming of Mr Bachchan - Sakshi

కారైకుడికి వెళ్లారు ‘మిస్టర్‌ బచ్చన్‌’. రవితేజ టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్‌ సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. కాగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ తమిళనాడులోని కారైకుడిలో ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement