పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు(ఏప్రిల్ 8న) 18వ వడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి తల్లి, నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. పంచ్ మీద పంచ్ కొడుతూ బాక్సింగ్ సాధన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అభిమానులతో అకీరా వీడియో పంచుకున్న రేణు దేశాయ్ 'అకీరా నాకు మంచి తనయుడు మాత్రమే కాదు ఆద్యకు గొప్ప సోదరుడు కూడా! అలాగే అతడి ఫ్రెండ్స్‌కు మంచి మిత్రుడు కూడా! అతడు ఎంతో మంచి మనసున్న జెంటిల్‌మెన్. ఈరోజు 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అకీరాకు బర్త్‌డే విషెస్ పంపుతున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అకీరా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం చేయగా దాన్ని రేణు దేశాయ్ తప్పుపట్టింది. అతడికి యాక్టర్ అవ్వాలని లేదని కుండ బద్ధలు కొట్టింది. అంతేకాకుండా అతడు ఇప్పటివరకు ఏ సినిమాకు సంతకం చేయలేదని, దయచేసి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
చదవండి: శంకర్ ఆఫర్‌ను తిరస్కరించిన అగ్ర నటుడు, అసలేం జరిగిందంటే
Comments
Please login to add a commentAdd a comment