అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లు లేటు వయసులో రీఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించిన నటీమణులు అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా అలరించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా నటిస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మరో నటి టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ అందాల నటి ఎవరో తెలుసుకుందాం.
(ఇది చదవండి: 'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!)
తెలుగువారికి హీరో భాను చందర్ పేరు సుపరిచితమే. ఆయన హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం‘నిరీక్షణ’. ఈ మూవీతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భామ అర్చన. 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా అనే కోలీవుడ్ టీవీ సీరియల్‌లోనూ కనిపించారు.
భానుచందర్ సరసన నటించిన ‘నిరీక్షణ’ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం 1986లో రిలీజ్ కాగా.. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డ్ దక్కింది. మధురగీతం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్చన ఆ తర్వాత వీడు, లేడీస్ టైలర్, దాసీ,ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్‌బంద్, పచ్చతోరణం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే భాను చందర్, అర్చన నటించిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్‌తో పాటు ఫిలింఫేర్ కూడా దక్కింది. దాసి చిత్రానికి సైతం మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు.
అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన రీఎంట్రీకి ఇస్తోంది. ప్రస్తుతం ఆమె షష్ఠిపూర్తి అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి'. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.
(ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి)
Comments
Please login to add a commentAdd a comment