
వైష్ణవ్ తేజ్
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇది మెగా ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, విశిష్ట దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించనున్న చిత్రంతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నారు. దర్శకుడు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment