చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment