మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ | pooja bedi daughter aalia furniturewalla to debut bollywood | Sakshi
Sakshi News home page

మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ

Nov 19 2018 3:07 AM | Updated on Nov 19 2018 3:07 AM

pooja bedi daughter aalia furniturewalla to debut bollywood - Sakshi

ఆలియా ఫర్నీచర్‌వాలా

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీ ఈ మధ్య బాగా కనిపిస్తోంది. శ్రీదేవి తనయ జాన్వీ ఆల్రెడీ ఎంట్రీ ఇవ్వగా సైఫ్‌ కుమార్తె సారా అలీఖాన్‌ రెడీగా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా బేడీ కుమార్తె కూడా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హిందీ చిత్రాలు ‘జో జీతా వహీ సికందర్, లూటేరా’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు పూజా బేడి. తెలుగులో ‘చిట్టెమ్మ మొగుడు, శక్తి’ సినిమాల్లోనూ ఆమె కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దర్శకుడు నితిన్‌ కక్కర్‌ తెరకెక్కించనున్న ‘జవానీ జానేమన్‌’ సినిమా ద్వారా పూజా బేడి కుమార్తె ఆలియా ఫర్నీచర్‌వాలా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సైఫ్‌ కుమార్తెగా ఆలియా నటించనున్నారని టాక్‌. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement