హీరోయిన్‌గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ? | Malayalam Actress Urvashi's Daughter To Enter As Heroine In Cinemas | Sakshi
Sakshi News home page

Urvashi: హీరోయిన్‌గా ఊర్వశి వారసురాలు ఎంట్రీ?.

Published Thu, Oct 19 2023 6:54 AM | Last Updated on Thu, Oct 19 2023 9:04 AM

Malayalam Actress Urvashi Daughter Entry As A Heroine In Cinemas - Sakshi

ముందానై ముడిచ్చు చిత్రంతో కథానాయకిగా పరిచయమై తన చిలిపితనంతో కూడిన నటనతో అందరినీ ఆకర్షించిన మలయాళ నటి ఊర్వశి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యారు. 1980-90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకిగా వెలిగిన ఆమె తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు.

(ఇది చదవండి: బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్‌కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?)

నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే మలయాళ నటుడు మనోజ్‌ కే.జయన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుంజట్టా అనే కూతురు ఉంది. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా ఊర్వశి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయినా కూతురు ఇద్దరి వద్ద ఉంటూ పెరుగుతూ వచ్చింది. కాగా.. ఆ తరువాత ఊర్వశి రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె కూతురు కుంజట్టాతో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.

దీంతో ఊర్వశి వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. కుంజట్టాకు కథనాయకికి కావలసిన అన్ని లక్షణాలు ఉండడంతో తర్వాత హీరోయిన్‌ అనే ప్రచారం ఊపందుకుంది. ఊర్వశి ఉద్దేశం కూడా అదే కావచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఇన్నాళ్లకు తన కూతురితో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కుంజట్టాను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి కొందరు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు టాక్‌. అయితే ఈ విషయంపై ఊర్వశి ఎలాంటి ప్రకటన చేయలేదు.

(ఇది చదవండి: ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement