
కురళ్ 388 చిత్రంతో తెలుగుస్టార్ నటుడు మంచువిష్ణు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు మోహన్‌బాబు పెద్దకొడుకే మంచువిష్ణు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కురళ్ 388. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్, కిరన్ ధనబాలా కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి సురభి హీరోయిన్‌గా, సంపత్‌కుమార్, నాజర్, మునీష్‌కాంత్, రామదాస్, జయప్రకాష్, పంజు సుబ్బు తలైవాసల్ విజయ్, ప్రగతి, సురేఖవాణి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
జీఎస్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీనికి ఎస్‌ఎస్ తమన్ సంగీతం, రాజేష్ యాదవ్ ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు.
చదవండి: Mahesh Babu: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్‌పై ఆసక్తిగా స్పందించిన మహేశ్ బాబు
Comments
Please login to add a commentAdd a comment