Malvi Malhotra Ready To Debut In Kollywood Cinema With RK - Sakshi
Sakshi News home page

Malvi Malhotra: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ.. అప్పుడే దశ తిరిగిపోయిందిగా!

Published Fri, Jul 7 2023 2:26 PM | Last Updated on Fri, Jul 7 2023 2:51 PM

Malvi Malhotra Ready To Debut In Kollywood Cimena With RK - Sakshi

పాత నీరు పోక, కొత్త నీరు రాక అన్న సామెత సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా కొత్త నటీమణులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి పరితపిస్తుంటారు. అలా చాలా మంది క్రేజీ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తాజాగా నటి మాల్వీ మల్హోత్రా కోలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.

(ఇది చదవండి: మీ క్యాలెండర్‌లో ఇది మార్క్‌ చేసుకోండి: చిరంజీవి )

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ పంజాబీ బ్యూటీ ముంబాయిలో నటిగా శిక్షణ పొంది ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. మొదట బుల్లితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ.. అలా వెండితెరలోనూ నాయకిగా నటిస్తున్నారు. ఇప్పటికే పంజాబీ, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు కోలీవుడ్‌కు ఎంట్రీ షురూ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు ఆర్‌కే సరసన నటించే అవకాశం ఈమెను వరించింది.

ప్రస్తుతం తెలుగులో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తోన్న 'తిరగబడరా సామీ' చిత్రంలో మాల్వీ మల్హోత్రా నటిస్తోంది. ఇందులో  మరో కథానాయిక మన్నారా చోప్రా కూడా కనిపించనుంది. ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ ఈ మూవీ నిర్మిస్తున్నారు.

(ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల)

మలయాళంలో రఫీ దర్శకత్వంలో దిలీప్‌, కీర్తీసురేశ్‌, హనీరోజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన రింగ్‌ మాస్టర్‌ 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్‌ కాబోతోంది. ఇందులో నటుడు ఆర్‌కే కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఇంతకు ముందు ఎల్లామ్‌ అవన్‌ సెయల్‌, అళగర్‌ మలై, వైగో ఎక్స్‌ప్రెస్‌ వంటి పలు విజయవతమైన చిత్రాల్లో నటించారు. కాగా చిన్న గ్యాప్‌ తరువాత ఈయన నటిస్తున్న ఈ చిత్రంలో నటి మాల్వీ మల్హోత్రా నాయకిగా నటించనున్నారు. బిగ్‌బాస్‌ అభిరామి ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఆర్‌.కన్నన్‌ దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభం కానున్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement