టాలీవుడ్‌లో వరుస హిట్స్‌.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది! | Samyuktha Menon Ready To Make Her Debut In Bollywood | Sakshi
Sakshi News home page

Samyuktha Menon: టాలీవుడ్‌లో వరుస హిట్స్‌.. క్రేజీ ఛాన్స్‌ కొట్టేసిన ముద్దుగుమ్మ!

Published Fri, May 24 2024 6:45 PM | Last Updated on Fri, May 24 2024 6:54 PM

Samyuktha Menon Ready To Make Her Debut In Bollywood

గతేడాది విరూపాక్ష, సర్‌ సినిమాలతో సూపర్‌హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్న భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్ సరసన స్వయంభులో కనిపించనుంది. అంతే కాకుండా ఆ తర్వాత శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. ‍అప్పుడే బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైంది.

కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్ తేజ్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆమె ఫస్ట్ హిందీ మూవీ కంటెండ్ బేస్ట్‌గా ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌  చేయనున్నట్లు లేటేస్ట్ టాక్‌. సర్‌ మూవీతో హిట్‌ కొట్టిన భామ.. వెంట వెంటనే అవకాశాలను కొల్లగొడుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement