24 మంత్ర ఆర్గానిక్ నూతన శ్రేణి | 24 mantra organic new range | Sakshi
Sakshi News home page

24 మంత్ర ఆర్గానిక్ నూతన శ్రేణి

Published Thu, Feb 25 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

24 మంత్ర ఆర్గానిక్ నూతన శ్రేణి

24 మంత్ర ఆర్గానిక్ నూతన శ్రేణి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేంద్రియ ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ 24 మంత్ర ఆర్గానిక్ బ్రాండ్‌లో కొత్త విభాగాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెడీ టు డ్రింక్, రెడీ టు కుక్ విభాగాల్లో  ప్రవేశించిన ఈ సంస్థ తొమ్మిది రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. కంపెనీ మొత్తం 200 రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. 15 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. 2018 నాటికి మరో నాలుగైదు ఏర్పాటు చేస్తామని సంస్థ వ్యవస్థాపకులు రాజ్ శీలం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో 25,000 మందికిపైగా రైతులతో కలిసి 1.5 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో అయిదు లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు మూడు లక్షల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. మూడు నాలుగేళ్లలో 10 లక్షల మంది కస్టమర్లకు చేరువ అవుతామని కంపెనీ సీఈవో ఎన్.బాలసుబ్రమణియన్ తెలిపారు. ఆన్‌లైన్ విక్రయాలు ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 2018 కల్లా 20-25 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement