
రామ్‌చరణ్
స్టార్లు ఏం చేస్తుంటారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఎక్కడ వెకేషన్‌లో ఉన్నారు అనే అప్‌డేట్స్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అందుబాటులోకి రావడం అభిమానులకు పండగలాంటిదే. ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా విభిన్న యాప్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేసి తమ గురించిన అప్‌డేట్స్ తెలియజేస్తున్నారు. ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు రామ్‌చరణ్. తన సినిమాలు, డైట్.. ఇలా చాలా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా రామ్‌చరణ్ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి పోస్ట్‌గా తన స్టిల్‌ను అప్‌లోడ్ చేశారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్, సైరా’ అప్‌డేట్స్ అన్నీ ఇందులో షేర్ చేస్తారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.