వెండితెరపై గీతామాధురి..
వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. మగాళ్లు వట్టి మాయగాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్స్, హస్కీ ఐటెమ్ నంబర్లతో తనదైన స్పీడ్ చూపించిన ఈ యువ గాయని లుక్స్ స్టైల్స్ తోను మెప్పిస్తోంది. ఇటీవలే `అతిథి` అనే షార్ట్ ఫిలింలో లీడ్ రోల్ పోషించిన గీతామాధురి త్వరలోనే వెండితెర మీద కూడా సందడి చేయనుందట.
అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో గీతామాధురి హీరోయిన్ గా నటిస్తుందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతా, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.