silverscreen
-
గాయం.. విజయ గేయం
ఏడాది అయిపోయింది దీపికా పదుకోన్ మేకప్ వేసుకుని సిల్వర్‌స్క్రీన్ మీద కనిపించి. తన నెక్ట్స్ సినిమా ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారామె. యాసిడ్ అటాక్ బాధితురాలిగా దీపిక ఓ సినిమాలో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ అటాక్ బాధితురాలి పాత్రలో కనిపించనున్నానని దీపిక అధికారికంగా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలసి ఆమె నిర్మిస్తుండటం విశేషం. ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే ఇందులో దీపికా సరసన యాక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి ‘చప్పాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘‘గాయం.. అద్వితీయమైన పోరాట పటిమ.. విజయ గేయం.. గాయం, విజయం చుట్టూ సాగే కథ ఇది. ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకోన్. -
వెండితెరపై గీతామాధురి..
వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. మగాళ్లు వట్టి మాయగాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్ సాంగ్స్, మెలోడీస్, ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్స్, హస్కీ ఐటెమ్ నంబర్లతో తనదైన స్పీడ్ చూపించిన ఈ యువ గాయని లుక్స్ స్టైల్స్ తోను మెప్పిస్తోంది. ఇటీవలే `అతిథి` అనే షార్ట్ ఫిలింలో లీడ్ రోల్ పోషించిన గీతామాధురి త్వరలోనే వెండితెర మీద కూడా సందడి చేయనుందట. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో గీతామాధురి హీరోయిన్ గా నటిస్తుందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతా, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.