వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ: బాలకృష్ణ
హిందూపురం: తన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తనను ఆదరించినట్టే తన కొడుకును కూడా ఆదరించాలని ప్రేక్షకులకు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జూన్ కల్లా మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. నయనతార, నటాషా దోషీ కథానాయికలు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.