
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ఆదిత్య 999 సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా ‘ఆదిత్య 999’ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశాడు.
వచ్చే ఏడాది ఆదిత్య 999 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా దమ్కీ ట్రైలర్ ను హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.
ట్రైలర్ చాలా బాగుందని, విజయం తథ్యమని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రేక్షకులు మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని తెలిపిన బాలకృష్ణ... దమ్కీ చిత్ర నటీనటులు, నిర్మాణ విలువలు బాగున్నాయని కితాబిచ్చారు. విశ్వక్ సేన్ తన తొలిచిత్రం నుంచి ఎంతో కష్టపడుతూ ఎదుగుతున్నాడన్న బాలకృష్ణ... విశ్వక్ సేన్ చిత్రాలు చూస్తే తన యుక్త వయస్సులో చేసిన సినిమాలు గూర్తొచ్చాయని ప్రశంసించారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న దమ్కీని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని విశ్వక్ సేన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment