జాతీయ గీతాలాపన బాలీవుడ్ పాట కాదు..
సందర్భం
సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి గవర్నర్, ఎమ్మెల్యే స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం.
జాతీయగీతం పాడుతున్న ప్పుడు ఎవరయినా సరే అవత లికి వెళ్లిపోవడానికి అదేం బాలీవుడ్ పాట కాదు. ఇటీ వల కర్నాటక గవర్నర్ వజు భాయ్ వాలా ఒక అధికారిక కార్యక్రమం చివరలో జాతీయ గీతాలాపన కొనసాగుతుం డగా లేచి వెళ్లిపోయారు. గవ ర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలంగాణ అసెంబ్లీని ఉద్దే శించి ప్రసంగిస్తుండగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు జాతీ య గీతాన్ని అవమానించడం వంటి చర్యలకు పూను కునే హక్కు ఎవరికీ ఉండదు. ఈ ఘటనతో 11 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా.
1987 ఆగస్టులో ముంబైలోని క్రాంతి మైదాన్‌లో క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం జరుగుతున్న ప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా జాతీయ గీతా లాపన మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో రహస్య రేడియోను నిర్వ హించిన స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహ తా దీంతో ఆగ్రహించి రాజీవ్‌ను వెనక్కు పిలవడమే కాకుండా ఆయనను తీవ్రంగా ఆక్షేపించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. కానీ కర్నాటక గవర్నర్ మాటేమిటి? తన అభ్యంతర చర్యకు గాను ఆయన నుంచి సంజాయిషీ కానీ, క్షమాపణ కానీ మనం నేటికీ వినలేదు. చివరకు రాష్ట్రపతి కూడా గవర్నర్‌ను బహిరంగంగా మందలిం చినట్లు లేదు. రాష్ట్రపతి లేదా కేంద్ర హోం శాఖ కానీ అం తర్గతంగా అలా మందలించి ఉండొచ్చు కానీ, జాతీయ గీతం ప్రాధాన్యతను గుర్తించే విషయంలో ప్రజలను జాగరూకులను చేయడానికి ఈ లోపాయకారీ చర్యలు సరిపోవు. ఈ ఘటన కేవలం అధికారిక లాంఛనాల ఉల్లంఘనకు మాత్రమే పరిమితం కాదు.
సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి ఈ స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం. కానీ జాతీయ గీతాన్ని ప్రజలు గౌరవించేలా చేయవలసిన అవసరం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్స వం సందర్భంగా కొద్ది రోజులకు ముందే అధికారులు ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించరాదనీ, వాటిని చెత్తసా మానులాగా పారవేయరాదని ప్రజలను కోరుతుం టారు. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయిన వెంటనే జాతీ య జెండా గౌరవం ముగిసిపోదు.
దేశ ప్రజలుగా మనం జాతీయ గీతాన్ని తేలికగా తీసుకోరాదనే నా అభిప్రాయాన్ని మరొక అంశం మరిం తగా బలపరుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని అనేక సార్లు వినిపిస్తు న్నందున దాన్ని గౌరవించడం గురించి మనందరికీ తెలిసి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉండవచ్చు కానీ, థియేటర్లలో ప్రసారం చేసే జాతీయ గీతం వెర్షన్లు అధికారపూర్వకమైనవి కావు. వాటిని తమదైన కళాత్మక స్వేచ్ఛతో స్వరపరుస్తున్నారు. అవి వినసొంపుగా ఉండ వచ్చు. కదిలించవచ్చు కానీ అవి అసలైన పాట వెర్షన్ కాదు. భారత ప్రభుత్వ వెబ్‌సైట్ (జ్ట్టిఞ://జుౌఠీజీఛీజ్చీ. జౌఠి.జీ) ప్రకారం జాతీయ గీతం అధికారిక వెర్షన్ పాడ టానికి పట్టే సమయం 52 సెకనులు కాగా, భారత బాల సృజనకారులు స్వరపరిచిన గీతం ఒక నిమిషం కంటే ఎక్కువగా ఉంటోంది. భారతీయ సైన్యం సహకారంతో జాతీయ గీతాన్ని స్వరపర్చిన ఒక స్వరకర్త సియాచిన్ గ్లేసియర్ నేపథ్యాన్ని ఉపయోగించగా, వన్యప్రాణులకు అంకితమిస్తూ రూపొందించిన జాతీయ గీతాలాపన రెం డు నిమిషాల ఒక సెకను వరకు సాగుతోంది. మరొకరైతే సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుల స్వరాలను అరువు తీసు కుని వారందరూ పాడిన గీత భాగాలను అతికించారు.
అయితే వీరెవరూ అధికారిక వెర్షన్ అయిన 52 నిమిషాల పరిమితిలో జాతీయ గీతాన్ని స్వరపర్చలేదు. వీరంతా అత్యున్నత కళాత్మక విషయంతో స్వరకల్పన చేసినందున వీరి కృషిని విమర్శించడానికో లేదా తక్కు వ చేసి చూపడానికో ఇలా రాస్తున్నట్లు భావించరాదు. కానీ వారు జాతీయ గీతాన్ని ఆలాపిస్తున్న తీరుతో ప్రజ లు దాన్ని ఇలాగే పాడాలి కామోసు అని పొరపడే ప్రమా దం ఎంతైనా ఉంది. చాలామంది భారతీయులు ఏఆర్ రహ్మాన్ స్వరపర్చిన వందే మాతరం పాట వెర్షన్‌ను స్వాతంత్య్రం రాకముందు నుంచీ పాడుతున్నట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు.
భారత ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం జాతీయ గీతా న్ని పాడేటప్పుడు, ఆలపించేటప్పుడు కొన్ని ప్రత్యేకత లకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరముంది. ఒకటి కాలవ్యవధి కాగా అధికారికంగానే రెండు వెర్షన్‌లు ఉన్నా యి. ఒకటి దీర్ఘ గీతం, మరొకటి హ్రస్వగీతం. పొట్టి గీతం జాతీయ గీతంలోని తొలి, చివరి పంక్తులు మాత్ర మే కలిగి ఉంటుంది. పైగా మరొక రెండు విషయాలను గీతాలాపన సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి. జాతీ య గీతం పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబ డాలి. పాడుతున్నప్పుడు అందరూ కలసి పాడాలి. ఆ సందర్భంలో ఉన్నవారంతా గొంతు కలపాలి.
కేంద్రప్రభుత్వం విధించిన ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో తెలంగాణ ఎంఎల్‌ఏలు, కర్నాటక గవర్నర్ వ్యవహరించిన తీరును మినహాయిం చడానికి తగినన్ని కారణాలు ఉండవచ్చు కానీ... జాతీ య గీతాన్ని పాడవలసిన సమయాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే.. ఆ సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం.
మహేష్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు
mvijapurkar@gmail.com