Mahesh Vija Purkar
-
ఎగువ సభలో ‘నామినీ’లు
విశ్లేషణ రాజ్యసభకు ప్రముఖులను నామినేట్ చేసే పద్ధతివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. లతామంగేష్కర్‌కు తాను సభకు హాజరు కావాలనే ఆలోచన కూడా లేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక వాణిజ్య ప్రకటనల్లో కనిపించసాగారు. రాజ్యసభలోని నామినే షన్ విభాగంలోని 7గురు సభ్యులకు గాను కేంద్ర ప్రభుత్వం 6 స్థానాలను ఇటీవలే పూరించింది. అయితే వీరి నియామకం దాని ఉద్దేశాన్ని నెరవేరుస్తుందా అని ఆలోచించ వలసిన సమయమిది. ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్, ఒలింపిక్ పతక గ్రహీత మేరీకోమ్, బీజేపీ సభ్యుడు, సోనియాగాంధీ కుటుంబంపై నిత్యం దాడి చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, మళయాళ నటుడు సురేష్ గోపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, పాత్రికే యుడు స్వపన్‌దాస్‌గుప్తా ఈ జాబితాలో ఉన్నారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1952లో నామినేట్ అయిన తొలి జాబితాలో ఉన్నారు. రుక్మిణీదేవి ఆరుండేల్, అల్లాడి కృష్ణస్వామి, కాకాసాహెబ్ కలేల్కర్, సర్దార్ పణిక్కర్ ఈ తొలి జాబితాలోని ఇతరులు. రాజ్యసభకు నామినేట్ కావడానికి ముం దు జాకీర్ హుస్సేన్ 22 ఏళ్లపాటు జామామిలియా వైస్‌చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. అప్పటినుంచి ఈ జాబితా ప్రముఖులు, రాజకీయరంగ మేళనంగా కనిపించేది. చివరిదయితే కేవలం రాజకీయ వాదులతో కూడి ఉండేది. రాజ్యసభను, రెండు సభల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లోని శాసన మండలిని ఎగువసభగా భావి స్తుంటారు. ఇది వివిధ అంశాలపై వాదనలకు సమ తూకం కల్పించే పెద్దల మండలి. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వీరిలో డజను మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. నిజానికి ఇది అధికారం లోని ప్రభుత్వం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజ కీయ పార్టీల ఎంపికే తప్ప మరొకటి కాదు. రాష్ట్రం లో గవర్నర్ ఈ పని చేస్తుంటారు. ఇక్కడ కూడా అధికారంలోని పార్టీ ఎంపికే నడుస్తుంటుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం ప్రకారం.. ‘‘సాహిత్యం, విజ్ఞానం, కళలు, సంఘసేవ వంటి రంగాల్లో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అను భవం కలిగిన నిష్ణాతుల నుంచి’’ ఈ నామినీలను ఎంపిక చేస్తారని రాజ్యసభ బుక్లెట్ సూచిస్తోంది. వీరు రాష్ట్రాలనుంచి ఎన్నికైన ఎంపీల వంటివారు. భారత రాష్ట్రపతి ఎన్నికలో వీరికి ఓటు హక్కు ఉండదన్నది మినహాయిస్తే ఇతర ప్రయోజనాల న్నింటినీ వీరు పొందుతారు. సభా కార్యక్రమాలను సుసంపన్నం చేసి, లోతైన అవగాహన కల్పించ డానికి, రాజ్యసభ వేదిక నుంచి తమకు తాము జాతికి సేవలందించడానికి వీరిని నామినేట్ చేస్తుం టారు. తమ ప్రత్యేక రంగాలనుంచి వీరు పొందిన ప్రావీణ్యతను సభలో ప్రదర్శించాలని జాతి ఆశిస్తుం ది. ఈ సుప్రసిద్ధ వ్యక్తులు రాజకీయ స్రవంతికి దూరంగానే ఉంటారు. ఒక సచిన్ టెండూల్కర్, ఒక లతామంగేష్కర్ వంటి ప్రము ఖుల ఔన్నత్యానికి నామినేషన్ ఒక గుర్తింపు లాంటిది. రాజ్యసభ నామినేషన్లు నిర్దేశిత సూత్రాల మార్గదర్శకత్వంలో సాగుతుంటాయన్న తప్పు విశ్వాసాలకు ఈ ఉదాహరణలు దారి తీయవచ్చు. ఇటీవల రాజ్యసభకు నామినేషన్, ఇతరత్రా ఎన్నిక కాని రాజకీయవాదులకు ఉపాధి మార్గంగా మారింది. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరం గా ఉన్నందున రాజ్యసభలో అడుగుపెట్టలేని ప్రము ఖుల్లాగే.. కొందరు నేతలు సభాకార్యకలాపాలకు చక్కగా దోహద పడగలిగినప్పటికీ ఇలా నామినేట్ ద్వారా ఎంపికవుతున్నారు. ప్రముఖుల ప్రాముఖ్యతను ఎంత వివరించి నప్పటికీ, రాజ్యసభ సభ్యుల నామినేషన్లో రాజ కీయ అనుబంధం ఏదో ఒక విధంగా లేదా ఇతర త్రా ప్రభావం చూపుతోంది. జాదవ్ వ్యవహారం కాస్త ఆసక్తి గొలుపుతుంది. ఎందుకంటే యూపీఏ హయాంలో ఇతను ప్రణాళికా కమిషన్ సభ్యుడిగానే కాకుండా, సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి సభ్యుడిగా కూడా ఉండేవారు. అందుకే ఎగువ సభల్లో (కేంద్రంలో, శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో) సభ్యత్వానికి వ్యక్తులను నామినేట్ చేయడం దుర్వినియోగమవుతోంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రావీణ్యతను ఆయన రాజకీయ అభిమతం కాపాడుతోంది. ఇక నవజ్యోత్ సిద్ధుకి బీజేపీలోనే సమస్యలు ఉన్నాయి. అందుకే అమృత్సర్ నుంచి లోక్‌సభకు రెండోసారి పోటీ చేయలేకపోయారు. రాష్ట్రపతి ద్వారా జరిగే ఇలాంటి నియామకాలు రాజ్యసభకు అవసరమైన నైపుణ్యాలున్న ఇతరు లను దూరంగా ఉంచుతున్నాయి. అయితే, కేవలం ‘గుర్తింపు’ భావన ద్వారానే రాజ్యసభకు ప్రముఖులను నామినేట్ చేయాలనే వాదనను నేను అంగీకరించను. తమకు చెందని రాజకీయేతర రంగాల్లో చట్టాల రూపకల్పన, ప్రావీ ణ్యతకు దోహదపడటం విషయంలో వారిని మరిం త ఒత్తిడి పెట్టాలి.. లతా మంగేష్కర్ని చూడండి. రాజ్యసభ సమావేశాలకు హాజరు కావాలని ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. మన టెండూల్కర్ అయితే క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత తరచుగా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తుంటారు తప్పితే రాజ్యసభకు హాజరు కాలేదు. ఇటీవలి కాలంలో ఒక్క జావేద్ అక్తర్ మాత్రమే దీనికి మినహాయింపు. హిందూ, ముస్లిం ఛాందసవాదులకు వ్యతి రేకంగా జావేద్ రాజ్యసభలో సాహసోపేతంగా మాట్లాడారు. సభలో పూర్తిగా లోపించిన మధ్యే మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యం కోసం ఆయన సభను ఉపయోగించుకున్నారు. అవును, నిర్లక్ష్యపూరితమైన కాపీరైట్ చట్టాల ప్రభావంపై ఆయన నిర్దిష్ట విజ్ఞానాన్ని తీసుకొచ్చారు. రాజకీయవాదులుగా ఉన్న చాలామంది ఇతరులు చేసింది చాలా తక్కువ కాని, రాజకీయాలు మాత్రం బాగానే ఆడారు. ఇక నామినేట్ అయిన కొందరు ఇతరులు తమ ఎంపికను ‘పనిచేయకుండా ఆరేళ్లు జీతం తీసుకునే ఉద్యోగం’ లాగే చూశారు. వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్ (సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com -
కరువులో కొత్త ఉపద్రవం
విశ్లేషణ నీటి ఆదాకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రెస్టారెంట్లు కూడా నీటిని పరిమితంగా వాడాలి. స్నానాలప్పుడు షవర్లకు బదులుగా బకెట్ నీటిని వాడాలి. కానీ మనవంతుగా మనం ఈ చర్యలకు పూనుకుంటున్నామా? మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక సీనియర్ రాజకీయ నేత ఏక్‌నాథ్‌ఖడ్సే. ఉప ముఖ్యమంత్రి అనే గుర్తింపు లేకపోయినప్ప టికీ ముఖ్యమంత్రి తదు పరి స్థాయి గల వ్యక్తి. ఆయన నుంచి అంతటి వివేకాన్నే ఆశిస్తాము. కాని లాతూర్‌కి సమీపంలోనే ఉన్న ప్రాంతంలో ఆయన హెలికాప్టర్లో దిగిన ప్పుడు దుమ్ము రేగకుండా ఉండేందుకు హెలిప్యాడ్ చుట్టూ 10 వేల లీటర్ల నీటిని చల్లారు. కానీ వాస్తవానికి ఇదే తీవ్ర దుమారాన్ని రేకెత్తించింది. నీటి కరువుతో అట్టుడుకుతున్న లాతూర్ సమీపంలో ఒక హెలిప్యాడ్‌పై అంత భారీ పరిమాణంలో నీటిని చల్లడం గురించి ఖడ్సేకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కానీ విషయం బహిరంగ మయ్యాక, ఏ ఒక్కరూ దానిపై వివరణ ఇవ్వలేదు సరికదా.. కాస్తంత పశ్చాత్తాపాన్ని కూడా ఎవరూ ప్రకటించలేదు. స్థానిక అధికారులను చీవాట్లు పెట్టారో లేదో మనకు తెలియదు. జరిగిన ఘటనపై ఏక్‌నాథ్‌ఖడ్సే విచారం వ్యక్తపర్చిందీ లేనిదీ కూడా మనకు తెలియదు. మండువేసవిలో చల్లిన 10 వేల లీటర్ల నీరు చూస్తుండగానే ఆవిరైపోయిన చందాన, ఈ కుంభకోణం కూడా ఆవిరైపోతుంది లెమ్మనే ఆశాభావంతో ప్రతి ఒక్కరూ వీలైనంత ప్రశాంత చిత్తంతో ఉండిపోయారు. అత్యంత విలువైన నీటిని వినియోగించడం ద్వారా దుమ్ము రేగని విధంగా హెలికాప్టర్ దిగేందుకు స్థానిక యంత్రాంగం ఎలా సహకరించిందనేది వింత గొలుపుతుంది. ఏమాత్రం సున్నితత్వాన్ని ప్రదర్శించక పోవడాన్నే ఈ ఘటన తెలుపుతోంది. తానెక్కిన హెలికాప్టర్‌ను దుమ్ము రేగుతున్న స్థితిలోనే దింపాలని, ఆ నీటిని రెండు ట్యాంకర్లలో ఏదైనా గ్రామానికి పంపాలని ఖాడ్సే అధికారులను ఆదేశించి ఉంటే, జీవనదాయిని అయిన నీటి విలువ పట్ల ఆయన సున్నితంగా వ్యవహరించి ఉండేవారు. నీరు అమూల్యమైనదే. కానీ లభ్యమవుతున్నప్పుడు దాన్ని ఎవరూ లెక్కించరు. మీరజ్, లాతూర్ మధ్య శుద్ధి చేసిన మంచి నీటి క్యారియర్లతో కూడిన రెండవ రైలును కూడా అందుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం అంతటి సున్నితత్వాన్ని ప్రదర్శించలేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి జరుపుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి మళ్లించవలసి రావడంతో ఖిన్నుడైన బీసీసీఐ కార్యదర్శి.. రాష్ట్రంలోని ఐదు నక్షత్రాల హోటళ్లలోని స్విమ్మింగ్ పూల్స్‌లో నీరు లేకుండా, పచ్చిక బయళ్లకు నీరు పెట్టకుండా చేస్తున్నారా? అని సరిగ్గానే ప్రశ్నించారు. ఆయన చెప్పిందాంట్లో గుర్తించవలసిన అంశముంది. నీటిని ఆదా చేయటమనే విధిలో ప్రతి చోటా ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, వాషింగ్‌మెషిన్ పూర్తిగా మురికి దుస్తులతో నిండిపోయేంతవరకు ఇళ్లలో ఎవరూ బట్టలు ఉతకకూడదు. ఇక రెస్టారెంట్లు కూడా నీటిని పరిమితంగా వాడాలి. అరగ్లాసు నీటితో మొదలెట్టాలి. గ్రామాల నీటివనరులను, చాలావరకు భూగర్భజలాలను ఉపయోగించకుండా బాటిల్ వాటర్ ఎక్కడినుంచో ఊడిపడదు మరి. స్నానాల విషయంలో షవర్లకు బదులుగా బకెట్ నీటిని ఉపయోగించాలి. అది కూడా నిండు బకెట్‌తో కాదు. కానీ, ఏక్నాథ్ఖడ్సేపై మనం విమర్శలు గురిపెడుతున్నప్పుడు, మనవంతుగా పై చర్యలకు పూనుకుంటున్నామా? ఏమైనప్పటికీ, ప్రజలు నీటికోసం అల్లాడు తున్నారని, మీ కుళాయిలను పూర్తి సామర్థ్యంతో పనిచేయించవద్దని ప్రభుత్వం ప్రజలకు బోధించ వలసి ఉంది. దీనికి బదులుగా ప్రభుత్వం లాతూర్ సమీపంలో హెలిప్యాడ్‌పై పెద్దఎత్తున నీరు చల్లడాన్ని అనుమతిస్తోంది. మరట్వాడాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత ఘోర నీటి సంక్షోభానికి ఇదొక శ్లేష వంటిది. బీసీసీఐ గౌరవ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యను ప్రభుత్వం తీవ్రంగానే స్వీకరించి నీటి వినియోగంపై ఆంక్షలు విధించవచ్చు. అలాగే ముంబైలో మంత్రుల బంగ్లాల్లోనూ పచ్చిక బయళ్లు ఉన్నాయి మరి. విచారకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని కొన్ని చక్కెర పరిశ్రమలు అధిక సామర్థ్యంతో పనిచేసే పంపుసెట్లను ఉపయోగించి, తమ ప్లాంట్లను పనిచేసేలా చూడటానికి ప్రయత్నించాయి. ఇదంతా మరుగునే జరిగి ఉండొచ్చు కానీ ఈ విషయం మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆ పరిశ్రమ లపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ లేవు. సహకారరంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా.. చక్కెర పరిశ్రమలు రాజకీయ నేతలు, రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవి. వీటితో ఎల్లప్పుడూ అత్యంత సున్నితంగా వ్యవహరించేవారు. అలా డయల్ చేయండి చాలు, వాణిజ్య చిరునామా డైరీ.. మరట్వాడా ప్రాంతంలోని అతిపెద్ద నగరం ఔరంగాబాద్‌లోని 20 నీటి శుద్ధి ప్లాంట్ల జాబితాను ఇట్టే చూపిస్తుంది. మిగిలినవాటిలాగే ఈ నగరం కూడా తీవ్ర మైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కానీ మనకు తెలుస్తున్న దేమిటంటే, స్థానిక నీటినే ఉపయోగిస్తూ ఈ ప్లాంట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. అలాగే నీటిని విస్తృతస్థాయిలో ఉపయోగిస్తూ బీర్ తయారీ దారులు బీరును తయారుచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీటిని మూసివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ చర్యలు చేపట్టడం అవసరమయినపుడు నీటి వృధా.. అది ఐపీఎల్, బీసీసీఐ ద్వారా జరిగినా లేదా వంట గదిలోని కుళాయి ద్వారా జరిగినా క్షంతవ్యం కాదు. కొన్ని రైల్వే స్టేషన్లను దయచేసి గమనించండి.. సమీప గ్రామాలనుంచి ప్రజలు రైలు కంపార్ట్మెంట్లలోకి దూరి ఫ్లష్ నుంచి వచ్చే నీటిని సేకరిస్తుండటాన్ని చూడవచ్చు. ఆ నీరు నేరుగా టాయ్లెట్లోకి వెళ్లేది. నీటి సమస్యను కరువు కాలం చర్చగా పరిమితం చేయవద్దు. వ్యాసకర్త మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ప్రజాభిప్రాయం పట్టని చట్టసభలు
విశ్లేషణ బ్రిటిష్ విద్యావేత్త, రాజకీయ నేత అయిన లార్డ్ మేఘ్‌నాథ్ దేశాయ్ ఇటీవల ఇలా రాశారు. ‘బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా నా 24 ఏళ్ల అను భవంలో, సభలో సభ్యు లు బ్యానర్లను ప్రదర్శించడం కాదు కదా.. గావుకేకలు పెట్టడం, తమ స్థానాలు వదలిరావడం, స్పీకర్ స్థానం వద్దకు దూసుకు పోవడం వంటి దృశ్యాలను నేనెన్న డూ చూడలేదు’. అలాగే ‘ప్రతినిధుల సభలో ఎవరైనా కొంతమంది హద్దు మీరి కేకలు వేస్తే, స్పీకర్ మందలించగానే అంతా సర్దుకోవడం’ సాధారణ సముచిత నడవడికగా ఉండేదని ఆయన అభివర్ణించారు. భారత పార్లమెంటులో ప్రస్తుతం నిత్య కృత్యంగా మారిపోయిన అంతరాయాల గురించి స్పీకర్ ఆవేదనపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన వ్యాసానికి ‘యాన్ అన్ పార్లమెంటరీ డెమోక్రసీ’ అని మంచి శీర్షికను పెట్టారు. భారత పార్లమెంటులో సెషన్ తర్వాత సెషన్లో అడ్డంకులు, అంతరాయా లను చూసి విసిగిపోయిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ.. ఇలా సభా కార్యక్రమాలకు అడ్డుపడేవారిని బయటకు పంపించేందుకు ‘లోక్‌సభకు ఉన్న తరహా అధికారాలను’ రూపొందించవలసిందిగా నియమ నిబంధనల కమిటీని ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ ఈ అధికారాలను ఉపయోగించ లేదని కాదు. తన అధికారాలను ఉపయోగించి నట్లయితే, సభ్యులు ప్రదర్శించే ఎలాంటి దుష్ర్ప వర్తననైనా స్పీకర్ అడ్డుకుంటారు. స్పీకర్ అధికార వినియోగాన్ని ఆమోదించడం అంటే సభ తనకు తానుగా తగిన ఔచిత్యంతో వ్యవహరిస్తున్నదని అర్థం కాదు. లోక్‌సభ స్పీకర్ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆరోజు జరగవలసిన కార్య క్రమాలు సజావుగా జరగడం కోసం సభను క్రమం లో పెట్టడానికి సంబంధించి వారు తరచుగా నిస్పృహకు గురవుతున్నట్లు సభా కార్యకలాపాలు చూపిస్తున్నాయి. అయితే ఒక సభ్యుడిని లేదా కొంతమంది సభ్యులను శిక్షించడానికి ప్రయత్నించడం అనేది.. అడ్డంకులను సృష్టించే సంస్కృతిని వదిలించు కోవడానికి అనుకూలమైనదిగా మారటం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది. చర్చ తర్వాత మెజారిటీ నిర్ణయానికి కలిగే పవిత్రత స్థానంలో అడ్డంకుల సంస్కృతి వచ్చి చేరటం శోచనీయం. సంబంధిత పార్టీల విప్‌లు, తరచుగా పార్టీల నాయకులు, చివరకు సోనియాగాంధీ వంటి అధినేతలు కూడా తమ తమ పార్టీలకు చెందిన సభ్యుల దుష్ర్పవర్తనపై మౌన ప్రేక్షకులుగా ఉంటున్నారు. అలాంటి వైఖరిని ప్రదర్శించడం ద్వారా వీరు సభ్యుల ప్రవర్తనను ఆమోదించడమే కాకుండా చెడు ధోరణులను ప్రోత్సహిస్తున్నవారవుతున్నారు. ప్రిసైడింగ్ అధికారుల అభ్యర్థనలను మన్నిం చని విచ్ఛిన్నకరమైన ప్రవృత్తి ప్రస్తుతం నిత్య వ్యవహారంలా మారిపోయింది. సభను విచ్ఛిన్న పర్చడం అనేది ఒక ఎత్తుగడ అని, దాన్ని వదిలించు కోవడం చాలా కష్టమని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు అంశాలను ఇక్కడ చూడాల్సిన అవసరముంది. ఒకటి, ఒక ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిన సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఫాలీ నారిమన్ సూచించినట్లు పార్లమెంటు నడవకపోతే, సభ్యులకు చెల్లింపులను ఆపివేయడం. ఇక రెండోది, ఎంపీలు సభా చర్చల్లో ఓటు వేసి నప్పుడే వారికి రావలసిన సౌకర్యాలు, వేతన పెంపు దల వంటివి తీసుకోవడానికి అనుమతించడం. నారిమన్ ఎంపీగా ఉన్నప్పుడు 2006లో ఆయన చేసిన ప్రతిపాదనపై పార్లమెంటు నేటికీ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇటీవల ఒక టీవీ వార్తా చానల్లో మాట్లాడుతూ.. జువెనైల్ బిల్ కేసులో వలే చట్ట సంస్థలు ప్రజాభిప్రాయ తీవ్రతను పసిగట్టిన సందర్భంలో మాత్రమే ఇలాంటివి చట్ట రూపం దాలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఎంపీల జీతభత్యాలు వంటివాటిని ఒక ప్రత్యేక, స్వతంత్ర కమిషన్ నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని సోమనాథ్ చటర్జీ గతంలో ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన కూడా ఉంది. పార్లమెంటులో సబ్సిడీ ధరలతో క్యాంటీన్లు నడపటంపై ప్రజలు తరచుగా తీవ్రమైన వ్యాఖ్యా నాలు చేస్తున్నప్పటికీ ఎంపీలు ప్రజాభిప్రాయంపై ఏ రకంగానూ స్పందించడం లేదు. ఎంపీలు మాత్రమే కాదు, అధికారులు, సిబ్బంది కూడా ఈ సౌకర్యాన్ని వినియోగిస్తుండటంపై పునఃపరిశీలన జరగడం లేదు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం గౌరవించటం లేదు. మరోవైపు ప్రజలు వీరిని భోజన పదార్థాలను కొల్లగొట్టేవారిలాగా లెక్కిస్తున్నారు. త మ వేతనాల పెంపుదలపై తామే నిర్ణయించుకోవడం అనేది కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు. సభ్యులకు అధిక ప్రయోజనాలను కలిగించే ఇలాంటి బిల్లులు పార్లమెంటులో లేదా రాష్ట్ర అసెంబ్లీలలో చివరిరోజు లేదా ఆ ముందటి రోజు మాత్రమే ఆమోదం పొందుతుంటాయి. చట్టసభల సభ్యులు తమ వేతనాలను తామే పెంచుకోవడంపై ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలు, సామాన్యుల వేతనాల పెంపుదలపై ప్రభావం చూపేంత స్థాయిలో కనిపించడంలేదు. పైగా సగటు మనిషి వేతనం పొందుతున్న పరిస్థితిలో కూడా అదే వ్యవస్థ నుంచి అదే స్థాయి సేవలను అందుకోవడం లేదు. రాజకీయ నేతలు సంపన్నులని, ఒక్కోసారి వారు అతి సంపన్నులుగా ఉంటున్నారని, తమ ఇచ్చ ప్రకారమే వారు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇలాంటి ప్రయోజనాలకు వారు అర్హులు కారని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. నేతలు రాజకీయాలను ఒక వృత్తిగా మార్చుకుని, దానిలోనే కొనసాగే వారసత్వ క్రమాన్ని తీసుకురావడం ద్వారా తమకు తాముగా రాజకీయాల్లో పాతుకుని పోయారని భావిస్తుండటం వల్లే ప్రజలు ఆగ్రహావేశులవు తున్నారు. రాజకీయ నేతలు పన్నులేని సంపదను పోగుచేసుకుంటున్నారని, అదే సమయంలో సగటు మనిషికి అలాంటి అవకాశాలను కల్పించడం లేదని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా తమకు సమాజంలో ఇంకా గౌరవం ఉందంటూ తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. (వ్యాసకర్త: మహేష్ విజా పుర్కార్ సీనియర్ పాత్రికేయులు) -
ఆ బడుల్లోనే మీ పిల్లలూ..
మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని అధికారులకు హైకోర్టు చెప్పింది. కాబట్టి ప్రభుత్వ బడుల్లోని పిల్లల ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజా నా నుంచి వేతనాలు తీసుకునే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ పిల్లల ను ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలల్లో మాత్రమే చేర్పించాలం టూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అది గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. నిత్యం తాము యథావిధిగా వండి వార్చే పిండివంటనే విధాన నిర్ణేతలు, వాటిని అమలు చేసేవారు రుచి చూడాలని ఉన్నత న్యాయస్థానం కోరుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాదరక్షలను ధరించండి, అవి ఎంత ఇరుగ్గా ఉన్నాయో చూడండి. అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయ మూర్తి సుధీర్ అగర్వాల్ ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉన్నతాధికారులు తాము స్వయంగా నిర్దేశించిన కార్య క్రమాలలో ఎవరి జోక్యాన్ని ఇష్టపడరు. ఇతరులు బాధితు లుగా ఉంటున్నంత కాలం.. తాము చేస్తూ వచ్చినదంతా ఉత్తమమైనదేనని వీరి ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఆదేశాలకు భిన్నంగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. ఇలా పోగుపడిన నిధితో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుప ర్చవచ్చు. చెడు వ్యవస్థను ఇన్నాళ్లుగా అందిస్తూ వచ్చిన వారిని దాని దుష్ఫలితాలను తాము కూడా అనుభవించడం తప్పనిసరి చేసే సమానత్వ పాఠశాలలకు స్వాగతం పలక వలసిందే కానీ, హైకోర్టు ఆదేశం వివిధ వర్గాల పిల్లలను పరస్పరం మిళితం చేయవచ్చన్న దృష్టికోణానికి అంతగా ప్రాధాన్యత లేకపోవచ్చు. ప్రజాతంత్ర రిపబ్లిక్లో ఉంటు న్నప్పటికీ, మనది ఆర్ధిక, కుల, ఉప కుల ఆలోచనలతో వేరుపడిపోయిన సమాజం. పైగా దీన్ని ప్రభుత్వాలు, రాజకీయ నేతలూ వివిధ మార్గాల్లో పెంచి పోషిస్తూ వస్తు న్నాయి. అయితే అపసవ్య ధోరణితో నడుస్తున్న పాఠశాల వ్యవస్థ కారణంగా శాశ్వతంగా నష్టపోతున్న నిరుపేదలపై పడుతున్న ఒత్తిడి, వారెదుర్కొంటున్న అణచివేతే ఇంకా ఘోరమైనది. సమాజం దీన్ని ఇంకెంతకాలమో భరించాలనుకో వట్లేదు. ఇందుకు సంబంధించి సంకేతాలు కూడా కనబ డుతున్నాయి. కేరళలోని మల్లపురంలో 11వ తరగతి విద్యార్థి 17 ఏళ్ల షహల్ కె. తను చదువుకుంటున్న పాఠశా లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుతూ 3 రోజుల నిరాహారదీక్షకు పూనుకున్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ దిగొచ్చి హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ఇతర ఉదాహరణలు కూడా వార్తలకెక్కుతున్నాయి. నది దాటి పాఠశాలకు వెళ్లేందుకు తమ తలలపై యూనిఫాంను పెట్టుకుని ఈదులాడుతూ వెళుతున్న పిల్లలు, తమ నాప్కి న్లను మార్చుకోవడానికి తగిన గోప్యత లేమితో పాఠశా లకు వె ళ్లడం మానేస్తున్న యుక్తవయస్సులోకి వచ్చిన బాలికలు.. వంటివి వీటిలో కొన్ని. మన దేశంలో పేదలు తమ స్థితిగతులను మెరుగు పర్చుకోవాలనీ, తమ జీవన అవకాశాలను పెంచుకోవా లనీ కోరుకుంటున్నట్లు ఇలాంటి సందర్భాలు తెలుపుతు న్నాయి కానీ వ్యవస్థ వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తోంది. మానవాభివృద్ధి సాధన స్థాయిలను నిర్ణయిం చే మూడు ప్రధాన అంశాలలో విద్య లేదా విజ్ఞానం ఒకటి. ఆరోగ్యం, ఆదాయం అనేవి ఇతర రెండు అంశాలు. భారత్‌లో మానవాభివృద్ధి సూచిక ఎంత పేలవంగా ఉం టోందో దీన్ని బట్టి తెలుస్తుంది. సరికొత్త ధోరణిలో వ్యవస్థ పనిచేయాలని, ఫలితాలను అందించాలని కోర డం ద్వారా ప్రజల స్థితిగతులను మెరుగుపర్చవలసిందిగా మనం పట్టు బిగిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఇది పత్రికల్లో పతాక శీర్షిక అయ్యేలా మలుస్తుంది. తమ శ్రేయస్సుకు హామీ లభించినంత కాలం పేదలను సర్వనాశనం చేసే విధానాలను అమలు చేసుకుంటూపోవడానికి వెనుకాడని ఉన్నత వర్గాల ఆలోచనా సరళిపైనే దాడి చేస్తున్నట్లుగా అలహాబాద్ హైకోర్టు తీర్పు కనిపిస్తోంది. ఉన్నత వర్గాల వైఖరి ఇలా లేనట్లయితే, గోధుమ, బియ్యం బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయే రేషన్ షాపులు మీకు ఉండేవి కావు. ఉపాధి హామీ పథకం కింది రోజు కూలీ మొత్తాన్ని ఇవ్వడంలో జాప్యం చేయటం లేదా దాన్ని పూర్తిగా మింగేయడమో కూడా జరిగేది కాదు. ఇది నిజంగానే ఒక పశుప్రాయమైన, మతిహీనమైన వ్యవస్థ. దీన్ని తుత్తునియలు చేయడానికి న్యాయమూర్తి ఒక మార్గా న్ని కనుగొన్నారు. ఈ ఉన్నతవర్గమే ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలను ఏర్పర్చడం, నిర్వహించడం తలనొప్పి వ్యవహారమన్న భావనకు వచ్చేసింది. వీటి ప్రమాణాలను కొనసాగించవలసి వస్తుందని కాదు.. పాఠశాలల ఇన్స్పెక్టరే ఉపద్రవమట. ఈ దేశాన్ని లాభాలు పోగు చేసుకునే విద్యా సంస్థలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి వాటితో కూడిన కొత్త వర్గంతో వీరు నింపేశారు. రాజకీయనేతలే ఎక్కువగా ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పర్చారు. పలు విశ్వవిద్యాలయాలే వీరి స్వాధీనంలో ఉన్నాయి. అంగట్లో సబ్బు లేదా శీతల పానీ యాలను అమ్ముతున్నట్లుగా వీటిని టెలివిజన్ యాడ్లతో ప్రోత్సహిస్తున్నారు. ఉన్నత వర్గాలు చేజిక్కించుకున్న ఈ సౌకర్యానికి మంగళం పలకాలని, సగటు మనిషితో కలసి ఉండ మని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ విద్యను అందించే విద్యా హక్కుకు ఆడంబ రంగా చట్ట రూపం ఇవ్వడంలో ఉన్న సాపేక్షిక వెసులు బాటును కూడా మన ముందు ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క టంటే ఒక్క శ్రేష్టమైన సందర్భం కూడా మనం చూడ లేదు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల ప్రతిఘటన, వాటిని కొన సాగించడంలో ప్రదర్శించే ఉపేక్ష సర్వసాధారణమై పోయాయి. పేదలు, సంప న్నులు ఎప్పటికీ ఒక వరలో ఇమడలేరు. అది అంతటి ప్రమాదమన్నమాట. గణాంకాల్లో ఒక భాగంగా మా త్రమే పేదలకు గుర్తింపు ఉన్నట్లు కనిపిస్తోంది. వారు మనుషులు కాదన్నమాట. ఒక సేవను మీకు అందిస్తామంటూ వాగ్దానం చేయ డం వంటి శాసనాల తయారీ ద్వారానే తమది సుపరి పాలన అనిపించుకోదని అర్థం చేసుకోవలసి ఉంది. సరైన విధంగా గుర్తించిన లక్షిత వర్గాలకు సేవలందించే సమ ర్థత ద్వారానే దాన్ని లెక్కించాలి. మనదగ్గర లేనిదల్లా ఇదే. ఉద్దేశించిన ఫలితాలతో పనిలేకుండా, పెట్టిన వ్యయం తోనే ఉద్దేశాలను నిర్ణయిస్తున్నారు. ఇన్నాళ్ల అస్తవ్యస్త పాలన ఫలితమే పేదలు. మీ డ్రైవర్, మీ పని మనిషి పిల్లలు చదువుతున్న పాఠశాలకే మీ పిల్లలను కూడా పంపవలసిందని ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు చెప్పింది. కాబట్టి వారి చెప్పులను మీరు ధరించండి, ఇబ్బందులను, కష్టాలను ఎలా తగ్గించాలి అని ఆలోచించండి. (వ్యాసకర్త: మహేశ్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు) -
ప్రజాగ్రహానికి కారకులెవరు?
ఒక మంత్రి కోసం ముగ్గురు ప్రయాణికులను విమానం నుంచి కిందికి దింపేయటం, ఒక సీఎం కోసం అంతర్జాతీయ విమానాన్ని ఆపివుంచడం (ఆ సీఎం కార్యదర్శి తన వీసా పత్రాలను వెంట తీసుకురావడం మర్చి పోయారు), ఎంపీల జీతభత్యాల పెంపుపై పార్లమెంటరీ కమిటీ సూచన చేయడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. పై ఘటనల కొనసాగింపుగా సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవతలి కారులో ప్రయా ణిస్తున్న కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలిక మరణిం చగా దాంట్లోని కొంతమంది గాయపడ్డారు. ఘటన జరగ్గానే హేమమాలిని షాక్‌కు గురయ్యారని తెలుస్తోం ది. బహుశా ఆమె దిగ్భ్రాంతి చెంది, ప్రమాదంలో గాయ పడిన వారికి సహాయం చేయాలని నిర్ణయించుకోలేక పోయి ఉండవచ్చు. బీజేపీ కార్యకర్తలు తమ విధేయత ప్రకటించుకోవడంలో భాగంగా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఉండవచ్చు. అయితే ఈ ఘటనలో ఇతర బాధితులు తమకు తక్షణం వైద్య సౌకర్యం కల్పించేవారు కనబడక సందిగ్ధ స్థితిలో ఉండిపోయారు. ఈ పరిస్థితిలో ఒక వైపరీత్యం, అసమానత ఉన్నాయి. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిపై సామాన్యులు ఎందుకు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారన్నే విష యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఈ విభజనలో ‘వారు’.. ‘మనము’ అనే వ్యత్యాసం ఉంది. ఇక్కడ డబ్బు కాకుం డా ఇతర విషయాలు ప్రాధాన్యం వహిస్తుంటాయి. ఎంపీలకు మల్లే, ప్రజల ఎరుకలో హేమమాలిని కూడా ‘వారిలో’ భాగమే మరి. కార్యాలయాల్లో తాము నిర్వహించే కర్తవ్యాలను నెరవేర్చడానికి ఈ విలువైన వ్యక్తులకు ఇలాంటి సౌకర్యా లు అత్యవసరం అని మనం భావిస్తూనే, సామాన్యు లను వారిలా ఇబ్బంది పెట్టడానికి కారణాలు కూడా ఉన్నాయని గుర్తించాలి. అది వారి డాంబికం. వీరి దృష్టిలో ఇతరులు లెక్కలోకి రారు. ఇతర పౌరులు వీరి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి సంబంధించి కేవలం యాధృచ్చికమైన వ్యక్తులు మాత్రమే. ప్రభుత్వాల భారీ బడ్జెట్లతో పోలిస్తే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరులు పొందుతున్న సౌక ర్యాలు చాలా చిన్నవి మాత్రమే. పైగా సామాన్యుడు వీరికయ్యే వ్యయం గురించి పెద్దగా బాధపడటం లేదు. కానీ వాటిని వారు తమ హక్కుగా భావిస్తుండటాన్నే వారు ఇష్టపడటం లేదు. వారి డాంబికమూ, రాజకీయా ల్లో సత్వరం ఆర్జించిన వారి వ్యక్తిగత సంపదను వారే మాత్రం ఇష్టపడటం లేదు. ప్రజాప్రతినిధులను చెడుమా ర్గాల్లో సంపాదించినవారిగా వారు అనుమానిస్తున్నారు. ఇక ఎంపీలకు వేతనాలు, భత్యాలను పెంచాలన్న సూచన కూడా ప్రముఖ వ్యక్తుల అవసరానికి సంబంధిం చినది కాదు. పార్లమెంట్ క్యాంటీన్లో వారు చెల్లించే అతి తక్కువ ధరలలోని అసంబద్ధతను ఇది పట్టి చూపు తుంది. ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు తమ సబ్సి డీని వదులుకోవాలని ప్రభుత్వం కోరుతున్న ఘటనపై ఒక టీవీ ప్రకటన వ్యాఖ్యానిస్తూ ఇది వంట గ్యాస్ లేనివారికి లబ్ధి చేకూరుస్తుందని సూచిస్తుంటుంది. ఇది గాయంపై మరోసారి కత్తిని పెట్టి తిప్పడమే అవుతుంది. ఇది బలిసిన పిల్లులకు, బక్క పిల్లులకు మధ్య ఉన్న విభజనను సూచించే ఆర్థిక వివక్షతకు సంబంధించిన అర్థాన్ని ధ్వనిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా గృహ బడ్జెట్లను తీవ్ర ద్రవ్యోల్బణం దెబ్బతీస్తున్నప్పటికీ, మన శాసన నిర్మాత లు సరుకుల ధరలను నియంత్రించడంలో సహాయం చేయలేకపోవడాన్ని చూసినట్లయితే.. ఈ తర్కం మరిన్ని విషయాలకూ వర్తిస్తుంది. వంట గ్యాస్‌కు పూర్తి ధర చెల్లించగలిగిన వారు కూడా సబ్సిడీలను ఎందుకు కోరు కుంటున్నారు? దుఃఖితులకు వ్యతిరేకంగా వాదించడం దారుణం. పైగా, తమకు తాము కల్పించుకున్న ప్రయో జనాలనుంచి లబ్ధి పొందుతున్న వారు వాటిని వదులు కోలేరు. ఇది అంతమయ్యేలా కనిపించడం లేదు కూడా. అత్యధిక ప్రయోజనాల జాబితాను రూపొందించిన ఎంపీలు తమ పార్లమెంటరీ పనిని మరింత అర్థవంతం గా చేసే పనుల కు ఎందుకు మద్దతు కోరటం లేదు? వారికి ప్రస్తుతం కల్పించిన వ్యక్తిగత సహాయకులకు బదులుగా, తగిన పరిశోధక బృందం కోసం వారెందుకు అడగటంలేదు? పరిశోధక బృందం ఉంటే సమాచారాన్ని సమర్థవంతంగా అందుకున్న ఎంపీలుగా వారు చక్కటి డేటాబేస్‌ను కలిగి ఉంటారు. బహుశా పార్లమెంటులో ముందు బెంచీల్లో కూచున్న వారు తప్ప మిగిలిన ఎంపీ లలో చాలామంది తమ పని పార్టీ విప్‌లపై ఆధారపడి ఓటువేయడానికే పరిమితమని భావిస్తుండవచ్చు. స్థానిక అభివృద్ధి నిధిని ఉపయోగించుకునే హక్కు ను కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము స్థానిక అంశాలకే పరిమితం చేసుకుంటున్నారు. ఒకసారి ఇలా వారి పాత్రను నిర్వచించడం, నిర్ధారించడం జరిగాక, సమాచార డేటాబేస్కు వారిని దూరం చేసి, వారి నియో జకవర్గాలకే పరిమితం చేస్తుంది. ఎంపీఎల్ఏడీ లేదా ఎంఎల్ఏఎల్ఏడీ నిధులు ఒక సందేశాన్నిస్తున్నాయి. మీ పని ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మీది నామమాత్ర మైన పాత్ర మాత్రమే. ఎంపీలు తమ పనితీరుని మెరుగుపర్చుకోవడం కోసం తగిన సహాయాన్ని కోరుకోవడం లేదన్న వాస్తవం పార్లమెంట్ లేదా రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ప్రయోజనా నికే హాని తలపెడుతోంది. పైగా తమ పాత్ర ఎంతో తక్కువ అని కూడా వారు భావిస్తున్నట్లు ఇది సూచిస్తోం ది. తమ ఆలోచనా తీరును మళ్లీ అంచనా వేసుకోవలసిన అవసరమున్న ఎంపీలతో సహా ఎవ్వరికీ ఇది మేలు చేకూర్చదు. ఎన్నికైన పదవుల్లో ఉన్న రాజకీయనేతలు తమపై వస్తున్న విమర్శను అలా సుతారంగా దులుపుకుని యథావిధిగా తమ తమ పనుల్లో మునిగిపోవడం చాలా తప్పు. (వ్యాసకర్త మహేష్ విజా పుష్కర్, సీనియర్ పాత్రికేయులు) -
జాతీయ గీతాలాపన బాలీవుడ్ పాట కాదు..
సందర్భం సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి గవర్నర్, ఎమ్మెల్యే స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం. జాతీయగీతం పాడుతున్న ప్పుడు ఎవరయినా సరే అవత లికి వెళ్లిపోవడానికి అదేం బాలీవుడ్ పాట కాదు. ఇటీ వల కర్నాటక గవర్నర్ వజు భాయ్ వాలా ఒక అధికారిక కార్యక్రమం చివరలో జాతీయ గీతాలాపన కొనసాగుతుం డగా లేచి వెళ్లిపోయారు. గవ ర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణ అసెంబ్లీని ఉద్దే శించి ప్రసంగిస్తుండగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు జాతీ య గీతాన్ని అవమానించడం వంటి చర్యలకు పూను కునే హక్కు ఎవరికీ ఉండదు. ఈ ఘటనతో 11 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా. 1987 ఆగస్టులో ముంబైలోని క్రాంతి మైదాన్‌లో క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం జరుగుతున్న ప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా జాతీయ గీతా లాపన మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో రహస్య రేడియోను నిర్వ హించిన స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహ తా దీంతో ఆగ్రహించి రాజీవ్‌ను వెనక్కు పిలవడమే కాకుండా ఆయనను తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. కానీ కర్నాటక గవర్నర్ మాటేమిటి? తన అభ్యంతర చర్యకు గాను ఆయన నుంచి సంజాయిషీ కానీ, క్షమాపణ కానీ మనం నేటికీ వినలేదు. చివరకు రాష్ట్రపతి కూడా గవర్నర్‌ను బహిరంగంగా మందలిం చినట్లు లేదు. రాష్ట్రపతి లేదా కేంద్ర హోం శాఖ కానీ అం తర్గతంగా అలా మందలించి ఉండొచ్చు కానీ, జాతీయ గీతం ప్రాధాన్యతను గుర్తించే విషయంలో ప్రజలను జాగరూకులను చేయడానికి ఈ లోపాయకారీ చర్యలు సరిపోవు. ఈ ఘటన కేవలం అధికారిక లాంఛనాల ఉల్లంఘనకు మాత్రమే పరిమితం కాదు. సినిమా హాళ్లలో జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు లేచి వెళ్లిపోయే సినీ ప్రేక్షకులకు హితవు చెప్పేటట్టుగా జాతీయ గీతం పవిత్రత గురించి ఈ స్థాయి నేతలకు గుర్తుచేయవలసి రావడం దురదృష్టకరం. కానీ జాతీయ గీతాన్ని ప్రజలు గౌరవించేలా చేయవలసిన అవసరం ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్స వం సందర్భంగా కొద్ది రోజులకు ముందే అధికారులు ప్లాస్టిక్ జెండాలు ఉపయోగించరాదనీ, వాటిని చెత్తసా మానులాగా పారవేయరాదని ప్రజలను కోరుతుం టారు. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయిన వెంటనే జాతీ య జెండా గౌరవం ముగిసిపోదు. దేశ ప్రజలుగా మనం జాతీయ గీతాన్ని తేలికగా తీసుకోరాదనే నా అభిప్రాయాన్ని మరొక అంశం మరిం తగా బలపరుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని అనేక సార్లు వినిపిస్తు న్నందున దాన్ని గౌరవించడం గురించి మనందరికీ తెలిసి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉండవచ్చు కానీ, థియేటర్లలో ప్రసారం చేసే జాతీయ గీతం వెర్షన్లు అధికారపూర్వకమైనవి కావు. వాటిని తమదైన కళాత్మక స్వేచ్ఛతో స్వరపరుస్తున్నారు. అవి వినసొంపుగా ఉండ వచ్చు. కదిలించవచ్చు కానీ అవి అసలైన పాట వెర్షన్ కాదు. భారత ప్రభుత్వ వెబ్సైట్ (జ్ట్టిఞ://జుౌఠీజీఛీజ్చీ. జౌఠి.జీ) ప్రకారం జాతీయ గీతం అధికారిక వెర్షన్ పాడ టానికి పట్టే సమయం 52 సెకనులు కాగా, భారత బాల సృజనకారులు స్వరపరిచిన గీతం ఒక నిమిషం కంటే ఎక్కువగా ఉంటోంది. భారతీయ సైన్యం సహకారంతో జాతీయ గీతాన్ని స్వరపర్చిన ఒక స్వరకర్త సియాచిన్ గ్లేసియర్ నేపథ్యాన్ని ఉపయోగించగా, వన్యప్రాణులకు అంకితమిస్తూ రూపొందించిన జాతీయ గీతాలాపన రెం డు నిమిషాల ఒక సెకను వరకు సాగుతోంది. మరొకరైతే సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుల స్వరాలను అరువు తీసు కుని వారందరూ పాడిన గీత భాగాలను అతికించారు. అయితే వీరెవరూ అధికారిక వెర్షన్ అయిన 52 నిమిషాల పరిమితిలో జాతీయ గీతాన్ని స్వరపర్చలేదు. వీరంతా అత్యున్నత కళాత్మక విషయంతో స్వరకల్పన చేసినందున వీరి కృషిని విమర్శించడానికో లేదా తక్కు వ చేసి చూపడానికో ఇలా రాస్తున్నట్లు భావించరాదు. కానీ వారు జాతీయ గీతాన్ని ఆలాపిస్తున్న తీరుతో ప్రజ లు దాన్ని ఇలాగే పాడాలి కామోసు అని పొరపడే ప్రమా దం ఎంతైనా ఉంది. చాలామంది భారతీయులు ఏఆర్ రహ్మాన్ స్వరపర్చిన వందే మాతరం పాట వెర్షన్‌ను స్వాతంత్య్రం రాకముందు నుంచీ పాడుతున్నట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం జాతీయ గీతా న్ని పాడేటప్పుడు, ఆలపించేటప్పుడు కొన్ని ప్రత్యేకత లకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరముంది. ఒకటి కాలవ్యవధి కాగా అధికారికంగానే రెండు వెర్షన్లు ఉన్నా యి. ఒకటి దీర్ఘ గీతం, మరొకటి హ్రస్వగీతం. పొట్టి గీతం జాతీయ గీతంలోని తొలి, చివరి పంక్తులు మాత్ర మే కలిగి ఉంటుంది. పైగా మరొక రెండు విషయాలను గీతాలాపన సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి. జాతీ య గీతం పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబ డాలి. పాడుతున్నప్పుడు అందరూ కలసి పాడాలి. ఆ సందర్భంలో ఉన్నవారంతా గొంతు కలపాలి. కేంద్రప్రభుత్వం విధించిన ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో తెలంగాణ ఎంఎల్ఏలు, కర్నాటక గవర్నర్ వ్యవహరించిన తీరును మినహాయిం చడానికి తగినన్ని కారణాలు ఉండవచ్చు కానీ... జాతీ య గీతాన్ని పాడవలసిన సమయాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే.. ఆ సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. మహేష్ విజా పుర్కార్, సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com