ఎగువ సభలో ‘నామినీ’లు
విశ్లేషణ
రాజ్యసభకు ప్రముఖులను నామినేట్ చేసే పద్ధతివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. లతామంగేష్కర్‌కు తాను సభకు హాజరు కావాలనే ఆలోచన కూడా లేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక వాణిజ్య ప్రకటనల్లో కనిపించసాగారు.
రాజ్యసభలోని నామినే షన్ విభాగంలోని 7గురు సభ్యులకు గాను కేంద్ర ప్రభుత్వం 6 స్థానాలను ఇటీవలే పూరించింది. అయితే వీరి నియామకం దాని ఉద్దేశాన్ని నెరవేరుస్తుందా అని ఆలోచించ వలసిన సమయమిది. ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్, ఒలింపిక్ పతక గ్రహీత మేరీకోమ్, బీజేపీ సభ్యుడు, సోనియాగాంధీ కుటుంబంపై నిత్యం దాడి చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, మళయాళ నటుడు సురేష్ గోపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, పాత్రికే యుడు స్వపన్‌దాస్‌గుప్తా ఈ జాబితాలో ఉన్నారు.
డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1952లో నామినేట్ అయిన తొలి జాబితాలో ఉన్నారు. రుక్మిణీదేవి ఆరుండేల్, అల్లాడి కృష్ణస్వామి, కాకాసాహెబ్ కలేల్కర్, సర్దార్ పణిక్కర్ ఈ తొలి జాబితాలోని ఇతరులు. రాజ్యసభకు నామినేట్ కావడానికి ముం దు జాకీర్ హుస్సేన్ 22 ఏళ్లపాటు జామామిలియా వైస్‌చాన్స్‌లర్‌గా వ్యవహరించారు. అప్పటినుంచి ఈ జాబితా ప్రముఖులు, రాజకీయరంగ మేళనంగా కనిపించేది. చివరిదయితే కేవలం రాజకీయ వాదులతో కూడి ఉండేది.
రాజ్యసభను, రెండు సభల వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లోని శాసన మండలిని ఎగువసభగా భావి స్తుంటారు. ఇది వివిధ అంశాలపై వాదనలకు సమ తూకం కల్పించే పెద్దల మండలి. వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వీరిలో డజను మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. నిజానికి ఇది అధికారం లోని ప్రభుత్వం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజ కీయ పార్టీల ఎంపికే తప్ప మరొకటి కాదు. రాష్ట్రం లో గవర్నర్ ఈ పని చేస్తుంటారు. ఇక్కడ కూడా అధికారంలోని పార్టీ ఎంపికే నడుస్తుంటుంది.
రాజ్యాంగంలోని 80వ అధికరణం ప్రకారం.. ‘‘సాహిత్యం, విజ్ఞానం, కళలు, సంఘసేవ వంటి రంగాల్లో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అను భవం కలిగిన నిష్ణాతుల నుంచి’’ ఈ నామినీలను ఎంపిక చేస్తారని రాజ్యసభ బుక్‌లెట్ సూచిస్తోంది. వీరు రాష్ట్రాలనుంచి ఎన్నికైన ఎంపీల వంటివారు. భారత రాష్ట్రపతి ఎన్నికలో వీరికి ఓటు హక్కు ఉండదన్నది మినహాయిస్తే ఇతర ప్రయోజనాల న్నింటినీ వీరు పొందుతారు. సభా కార్యక్రమాలను సుసంపన్నం చేసి, లోతైన అవగాహన కల్పించ డానికి, రాజ్యసభ వేదిక నుంచి తమకు తాము జాతికి సేవలందించడానికి వీరిని నామినేట్ చేస్తుం టారు. తమ ప్రత్యేక రంగాలనుంచి వీరు పొందిన ప్రావీణ్యతను సభలో ప్రదర్శించాలని జాతి ఆశిస్తుం ది. ఈ సుప్రసిద్ధ వ్యక్తులు రాజకీయ స్రవంతికి దూరంగానే ఉంటారు. ఒక సచిన్ టెండూల్కర్, ఒక లతామంగేష్కర్ వంటి ప్రము ఖుల ఔన్నత్యానికి నామినేషన్ ఒక గుర్తింపు లాంటిది.
రాజ్యసభ నామినేషన్లు నిర్దేశిత సూత్రాల మార్గదర్శకత్వంలో సాగుతుంటాయన్న తప్పు విశ్వాసాలకు ఈ ఉదాహరణలు దారి తీయవచ్చు. ఇటీవల రాజ్యసభకు నామినేషన్, ఇతరత్రా ఎన్నిక కాని రాజకీయవాదులకు ఉపాధి మార్గంగా మారింది. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరం గా ఉన్నందున రాజ్యసభలో అడుగుపెట్టలేని ప్రము ఖుల్లాగే.. కొందరు నేతలు సభాకార్యకలాపాలకు చక్కగా దోహద పడగలిగినప్పటికీ ఇలా నామినేట్ ద్వారా ఎంపికవుతున్నారు.
ప్రముఖుల ప్రాముఖ్యతను ఎంత వివరించి నప్పటికీ, రాజ్యసభ సభ్యుల నామినేషన్‌లో రాజ కీయ అనుబంధం ఏదో ఒక విధంగా లేదా ఇతర త్రా ప్రభావం చూపుతోంది. జాదవ్ వ్యవహారం కాస్త ఆసక్తి గొలుపుతుంది. ఎందుకంటే యూపీఏ హయాంలో ఇతను ప్రణాళికా కమిషన్ సభ్యుడిగానే కాకుండా, సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి సభ్యుడిగా కూడా ఉండేవారు. అందుకే ఎగువ సభల్లో (కేంద్రంలో, శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో) సభ్యత్వానికి వ్యక్తులను నామినేట్ చేయడం దుర్వినియోగమవుతోంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రావీణ్యతను ఆయన రాజకీయ అభిమతం కాపాడుతోంది. ఇక నవజ్యోత్ సిద్ధుకి బీజేపీలోనే సమస్యలు ఉన్నాయి. అందుకే అమృత్‌సర్ నుంచి లోక్‌సభకు రెండోసారి పోటీ చేయలేకపోయారు. రాష్ట్రపతి ద్వారా జరిగే ఇలాంటి నియామకాలు రాజ్యసభకు అవసరమైన నైపుణ్యాలున్న ఇతరు లను దూరంగా ఉంచుతున్నాయి.
అయితే, కేవలం ‘గుర్తింపు’ భావన ద్వారానే రాజ్యసభకు ప్రముఖులను నామినేట్ చేయాలనే వాదనను నేను అంగీకరించను. తమకు చెందని రాజకీయేతర రంగాల్లో చట్టాల రూపకల్పన, ప్రావీ ణ్యతకు దోహదపడటం విషయంలో వారిని మరిం త ఒత్తిడి పెట్టాలి.. లతా మంగేష్కర్‌ని చూడండి. రాజ్యసభ సమావేశాలకు హాజరు కావాలని ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. మన టెండూల్కర్ అయితే క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత తరచుగా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తుంటారు తప్పితే రాజ్యసభకు హాజరు కాలేదు. ఇటీవలి కాలంలో ఒక్క జావేద్ అక్తర్ మాత్రమే దీనికి మినహాయింపు.
హిందూ, ముస్లిం ఛాందసవాదులకు వ్యతి రేకంగా జావేద్ రాజ్యసభలో సాహసోపేతంగా మాట్లాడారు. సభలో పూర్తిగా లోపించిన మధ్యే మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యం కోసం ఆయన సభను ఉపయోగించుకున్నారు. అవును, నిర్లక్ష్యపూరితమైన కాపీరైట్ చట్టాల ప్రభావంపై ఆయన నిర్దిష్ట విజ్ఞానాన్ని తీసుకొచ్చారు. రాజకీయవాదులుగా ఉన్న చాలామంది ఇతరులు చేసింది చాలా తక్కువ కాని, రాజకీయాలు మాత్రం బాగానే ఆడారు. ఇక నామినేట్ అయిన కొందరు ఇతరులు తమ ఎంపికను ‘పనిచేయకుండా ఆరేళ్లు జీతం తీసుకునే ఉద్యోగం’ లాగే చూశారు.
వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్ (సీనియర్ పాత్రికేయులు)
ఈమెయిల్: mvijapurkar@gmail.com