ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సత్నామ్ సంధూ ఎగువసభకు నామినేట్ చేయడాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ స్వాగతించారు. సమాజ సేవ చేయడంలో సంధూ కృష్టి, విద్య, ఆవిష్కరణలపై ఆయనకున్న అభిరుచి రాజ్యసభ ఉన్నతికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అతని పదవి కాలం ఉత్తమంగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈసందర్భంగా సంధూకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. సత్నామ్ సింగ్‌ను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఆయన గొప్ప విద్యావేత్త అని, సామాజిక కార్యకర్తగా అభివర్ణించారు. అట్టడుగు స్థాయి ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ సమైక్యత కోసం విస్తృతంగా పనిచేస్తున్నారని, ఆయన పార్లమెంటరీ ప్రయాణం ఉత్తమంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన అభిప్రాయాలతో రాజ్యసభ కార్యకలాపాలు సుసంపన్నం అవుతాయని భావిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
I am delighted that Rashtrapati Ji has nominated Shri Satnam Singh Sandhu Ji to the Rajya Sabha. Satnam Ji has distinguished himself as a noted educationist and social worker, who has been serving people at the grassroots in different ways. He has always worked extensively to… pic.twitter.com/rZuUmGJP0q
— Narendra Modi (@narendramodi) January 30, 2024
రైతు కొడుకు నుంచి యూనివర్సిటీ ఫౌండర్‌గా..
పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్ సంధూ ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలో చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడిన సత్నామ్..తనలా ఎవరూ బాధలు పడకూడదని నిర్ణయించుకొని అత్యుత్తమ నైపుణ్యాలతో విద్యను అందించేందుకు 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించాడు. 2012లో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీగా తొలి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ వర్సిటీకి ఆయన ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు.
దేశంలోనే ప్రముఖ విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు సంధూ. ఇతరులకు సాయం చేయడంలోనూ ఆయన ముందుంటారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్,(IMF) న్యూ ఇండియా డెవలప్‌మెంట్ (NID) ఫౌండేషన్ పేరుతో రెండు ఎన్‌జీవోలను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యం, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆర్థికసాయం చేస్తున్నారు. విద్యా రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యత్వం కల్పించింది.
కాగా వివిధ రంగాకు చెందిన వారికి డైరెక్ట్ రాజ్యసభకు నామినేట్ చేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ ప్రకారం.. కళలు, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక సేవలకు చేసిన సేవలకు గాను 12 మంది సభ్యులను ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు రాష్ట్రపతికి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment