Ind vs WI 1st T20I: Hardik Pandya Gets Emotional During National Anthem - Sakshi
Sakshi News home page

IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌! వీడియో వైరల్‌

Aug 4 2023 8:48 AM | Updated on Aug 4 2023 9:09 AM

Hardik Pandya Gets Emotional During National Anthem - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఉబికి వస్తున్న కన్నీరును హార్దిక్‌ ఆపుకోలేకపోయాడు. తన చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ హార్దిక్‌ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ దూరంకావడంతో హార్దిక్‌ పాండ్యా భారత జట్టు సారధిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. విండీస్‌ చేతిలో 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవ్వగా.. విండీస్‌ బౌలర్‌ షెపర్డ్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

టీమిండియా ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ(39) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. విండీస్‌ బౌలరల్లో మెకాయ్‌, హోల్డర్‌, షెపర్డ్‌ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.అంతకముందు బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. కెప్టెన్‌ పావెల్‌(48), పూరన్‌(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్‌-విండీస్‌ మధ్య రెండో టీ20 ఆగస్టు6న గయానా వేదికగా జరగనుంది.
చదవండి#Tilak Varma: అరంగేట్రంలోనే అదుర్స్‌.. తొలి 3 బంతుల్లోనే 2 సిక్స్‌లు! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement