Fans blast Hardik Pandya after India lose T20I series to West Indies - Sakshi
Sakshi News home page

#Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్‌?

Published Mon, Aug 14 2023 9:03 AM

Fans blast Hardik Pandya after India lose T20I series to West Indies - Sakshi

కరేబియన్‌ పర్యటనను భారత జట్టు నిరాశతో ముగించింది. ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణాయత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో విండీస్‌కు అప్పగించేసింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో హార్దిక్‌ సేన విఫలమైంది.

బ్యాటింగ్‌ అనుకూలించే పిచ్‌పై సూర్యకుమార్‌, తిలక్‌ మినహా మిగితాందరూ తేలిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్‌ వర్మ(27) పరుగులతో రాణించాడు.

ఇక బౌలింగ్‌లో అయితే భారత జట్టు దారుణ ప్రదర్శన కనబరిచారు. విండీస్‌ బ్యాటర్లు ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(85 నాటౌట్‌), నికోలస్‌ పూరన్‌(47) టీమిండియా బౌలర్లను ఊచకోత కోశారు. భారత బౌలర్లు కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది.

హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ.. 
ఇక విండీస్‌పై సిరీస్‌ కోల్పోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ వల్లే భారత్‌ ఓడిపోయిందని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు.

తొలుత బ్యాటింగ్‌లో 18 బంతులు ఆడి 14 పరుగులు చేసిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు వేసి 32 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఓడిపోవడం మంచిదే.. మా బాయ్స్‌ అద్భుతం! చాలా సంతోషంగా ఉన్నా: హార్దిక్‌


 

Advertisement
 
Advertisement
 
Advertisement