సైగలతో జాతీయ గీతాలాపన | Govt launches video of National Anthem in sign language | Sakshi
Sakshi News home page

సైగలతో జాతీయ గీతాలాపన

Published Fri, Aug 11 2017 1:24 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM

Govt launches video of National Anthem in sign language

న్యూఢిల్లీ: సైగలతో జాతీయ గీతం ఆలాపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే గురువారం విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు .

‘జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలి. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నాం’ అని మంత్రి అన్నారు. గోవింద్‌ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement