
అధ్యక్షుడు మారినా ఆమెకే ఛాన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అయినా, ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ అయినా ఓ బాలిక మాత్రం వెరీ లక్కీ. ఆ టీనేజ్ సంచలనం పేరు జాకీ ఇవాంచో. అమెరికన్లకు ఆ 16 ఏళ్ల టీనేజ్ సంచలనం కొత్తేమీ కాదు. గతంలో ప్రదర్శలిచ్చిన ఆమెకు ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో జాతీయ గీతం పాడేందుకు అవకావం కల్పించారు. అమెరికన్లకు ఇవాంచో ఎంతో స్ఫూర్తిగా నిలుస్తారని అమెరికా అధికార ప్రతినిధి బొరిస్ ఇపిస్టేన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
వివాదాలకు దూరంగా ఉండటం ఇవాంచోకు అవకాశాలు కల్పిస్తుందని, ఆమె క్లాసికల్ సింగర అని బొరిస్ తెలిపారు. 2010లో క్రిస్మస్ వేడుకలలో ప్రదర్శణ ద్వారా ఇవాంచో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన చాలా ఈవెంట్లలో ఆమె పాటలు పాడి దేశ ప్రజల ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లలో ‘ గాడ్ బ్లెస్ అమెరికా’ ని ఆలపించింది. గత ఈవెంట్లలో బియాన్స్, కెల్లీ క్లార్క్‌సన్, అరేటా ఫ్రాంక్లిన్ లు ప్రదర్శన చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు పాప్ స్టార్స్ బియాన్స్, కేటి పెర్రీ బహిరంగంగానే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీరికి అవకాశం ఇవ్వలేదని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
10 ఏళ్ల వయసులో యూట్యూబ్ సంచలనంగా మారిన ఇవాంచో ‘ అమెరికా గాట్ టాలెంట్’ గా ఎంపికైంది. అప్పటినుంచీ అమెరికా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె ఎంపికపై మాట్లాడుతూ.. ‘ నాకు ఈ ఈవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలో ఒబామా ప్రభుత్వంలో ఈవెంట్స్ చేశాను. ఇప్పుడు ట్రంప్ సమక్షంలో ప్రదర్శన ఇవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని టీనేజ్ సింగర్ జాకీ ఇవాంచో చెప్పింది.