'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు.. | This family was forced to leave the theater for not standing up during the national anthem | Sakshi
Sakshi News home page

'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు..

Published Mon, Nov 30 2015 5:04 PM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు.. - Sakshi

'తమాషా' థియేటర్ నుంచి గెంటేశారు..

ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతం వినిపించినపుడు గౌరవ సూచకంగా లేచి నిలబడలేదనే కారణంతో ఓ మతానికి చెందిన కుటుంబాన్ని ఆ థియేటర్ నుంచి బయటకు పంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

గత శుక్రవారం విడుదలయిన హిందీ చిత్రం 'తమాషా'ను ప్రదర్శిస్తున్న ఓ మల్టీప్లెక్స్లో ఈ సంఘటన జరిగింది. తమాషా చిత్రం ప్రారంభకాకముందు జాతీయ గీతాన్ని ప్లే చేశారు. థియేటర్లోని ప్రేక్షకులు లేచి నిలబడగా, ఆ సమయంలో ఓ కుటుంబ సభ్యులు మాత్రం సీట్లలోనే కూర్చున్నారు. ఇది గమనించిన ప్రేక్షకులు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్  సిబ్బంది జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని బయటకు పంపారు. ఆ కుటుంబం వెళ్లడంతో ఇతర ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.  అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం కచ్చితంగా తెలియరాలేదు. బెంగళూరులోని అని కొన్ని, ముంబై కుర్లా ప్రాంతంలో అని మరికొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించలేదు. కొందరు నెటిజన్లు మాత్రం వెంటనే స్పందించి ప్రేక్షకుల చర్యను సమర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement