కుషాల్ ఓ ఇడియట్ : అమీషా | kushal comments on ameesha, ameesha reply to kushal | Sakshi
Sakshi News home page

కుషాల్ ఓ ఇడియట్ : అమీషా

Published Tue, Oct 27 2015 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

కుషాల్ ఓ ఇడియట్ : అమీషా

కుషాల్ ఓ ఇడియట్ : అమీషా

సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతుందో, అంతకు మించి చెడు కూడా చేస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కొంత మంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వ్యక్తిగత దూషణలకూ కారణం అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. టీవీ ఆర్టిస్ట్ కుషాల్ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ మీద చేసిన కామెంట్స్, తరువాత అమీషా ఆ కామెంట్స్పై స్పందించిన తీరు ఇండస్ట్రీ సర్కిల్స్లో వివాదానికి తెరతీసింది.

అమీషా జుహులోని పివిఆర్ థియేటర్లో సినిమా చూస్తుండగా తను చూసిన విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కుషాల్. థియేటర్లో జాతీయగీతం వస్తున్న సమయంలో ఓ అమ్మాయి గౌరవసూచకంగా నిలబడకుండా కూర్చొని ఉందని, ఆమె వికలాంగురాలేమో అనుకున్నానని, కాని ఆమె అమీషా పటేల్ కావటంతో ఆశ్యర్యపోయానని కుషాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ కామెంట్స్పై తీవ్రంగా స్పందించింది అమీషా. తను ఆడవాళ్లకు ఉండే వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆరోజు థియేటర్లో లేచి నిలబడలేదని, ఈ సమస్యను అర్థం చేసుకోలేని కుషాల్ ఓ ఇడియట్ అంటూ ఘాటుగా స్పందించింది. కుషాల్కు తల్లి, చెల్లి లేరేమో అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ల వ్యక్తిగత విషయాలు, సమస్యలను పట్టించుకోని కుషాల్ లాంటి వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలంటూ ట్వీట్ చేసింది అమీషా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement