నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా జాతీయ గీతాన్ని అవమానించారు.
కోల్ కతా: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా జాతీయ గీతాన్ని అవమానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఫరూక్ ముందు వరుసలో కూర్చున్నారు.
జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలుచున్నారు. ఫరూక్ మాత్రం ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. రాజ్యాంగంలోని 51(ఎ) అధికరణ ప్రకారం జాతీయ పతాకాన్ని, గీతాన్ని గౌరవించడం ప్రతీ పౌరుని ప్రాథమిక విధి.