థియేటర్‌లో జాతీయ గీతాన్ని అగౌరపరిచినందుకు..
♦ ముగ్గురు కశ్మీరి విద్యార్థులు అరెస్టు
హైదరాబాద్: నగరంలోని ఓ థియేటర్‌లో జాతీయగీతం వస్తున్నప్పుడు నిలబడనందుకు ముగ్గురు కశ్మీర్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివార్లైన చేవెళ్లలోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓమర్ ఫైయాజ్ లూనీ, ముదాబిర్ షబ్బీర్, జమీల్ గుల్‌లు ఆదివారం అత్తాపుర్‌లోని ఓ థియేటర్‌కు సినిమా చూడడానికి వెళ్లారు.
సినిమాకు ముందు జాతీయ గీతం రాగా సదరు విద్యార్థులు నిలబడకుండా అగౌరవపరిచారని అదే థియేటర్లో ఉన్న ఓ ఐజీ ర్యాంకు పోలీస్ అధికారి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే థియేటర్ కు చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి 1971 జాతీయ జెండా నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకుల్ని గంటలకొద్దీ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని బెయిల్ మంజూరు చేశారు.