జాతీయ గీత ఆలాపనలో ప్రపంచ రికార్డు
జాతీయ గీత ఆలాపనలో ప్రపంచ రికార్డు
Published Sat, Jan 21 2017 8:16 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
రాజ్కోట్ : ఓ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో భక్తి పరవశంతో పాటు జాతీయ భావం వెల్లివిరిసింది. 3.5 లక్షలకు పైగా మంది ప్రజలంతా ఒకేవేదికపైకి వచ్చి ఆలపించిన జాతీయ గీతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటుదక్కించుకుంది. గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా కాగ్వాడ్లో కొత్తగా నిర్మించిన కోడల్ ధామ్ దేవాలయంలో కొడియార్ దేవత విగ్రహ ప్రతిష్ట సమయంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న 3.5 లక్షలకు పైగా మంది జాతీయగీతం ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు కోడల్ ధామ్ దేవాలయ ట్రస్ట్ సభ్యుడు హన్సరాజ్ గజేరా తెలిపారు.
2014లో బంగ్లాదేశ్లో 2,54,537 మంది ప్రజలు జాతీయ గీతం ఆలపించి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఈ రికార్డును చేధించినట్టు గజేరా పేర్కొన్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారుల నుంచి ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ను పొందామని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 40 కిలోమీటర్ల శోభ యాత్ర, 1008-కుండ్ మహాయగ్న నిర్వహించి ఇప్పటికే ఈ ట్రస్ట్ లిమ్కా బుక్ రికార్డులో చోటు సంపాదించింది. జనవరి 17న ప్రారంభమైన ఐదు రోజుల ఈ వేడుకకు, 50 లక్షలకు పైగా భక్తులు హాజరైనట్టు ట్రస్ట్ పేర్కొంది. రూ.60 కోట్లతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. టెంపుల్ పరిసర ప్రాంతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్మించాలని ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement