జయహో తెలంగాణ సంబురాలు | jai ho telangana celebrations | Sakshi
Sakshi News home page

జయహో తెలంగాణ సంబురాలు

Published Tue, Mar 18 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

జయహో తెలంగాణ సంబురాలు

జయహో తెలంగాణ సంబురాలు

 రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్‌లోని సూపర్‌బజార్ వద్ద జయహో తెలంగాణ సంబురాలు పేరిట కార్యక్రమం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తూర్పు జిల్లాకు చెందిన కళాకారులు, విద్యావంతులు, జేఏసీ నేతలు, రచయితలు, అమరవీరుల తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
 
 కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్, తూర్పు జిల్లా జేఏసీ చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ధూంధాం వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు హాజరయ్యారు.
 
 కార్యక్రమంలో పీవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల వినయ్, ప్రధాన కార్యదర్శి పొన్నాల సాగర్, సర్పంచ్ జాడి శ్రీనివాస్, పట్టణ జేఏసీ కన్వీనర్ పెద్దపెల్లి ఉప్పలయ్య తదిత రులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement